Home News శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు

శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు

0
SHARE

వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.వేద పండితులు శాస్త్రుల కృష్ణమూర్తి పంతులు గణపతి పూజ,సరస్వతీ యజ్ఞం నిర్వహించిన అనంతరం చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు.

అంతకు ముందు పాఠశాల నూతన పై అంతస్తు తరగతి గదులను సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సురెందర్,న్యాయవాది వీరారెడ్డి‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా సరస్వతీ దేవిని స్తుతిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు,గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.

విద్యకు సంబందించిన పలు ఏకపాత్రాభినయాలు,సాంస్కృతిక కార్యక్రమాల అందరిని ఆకట్టుకున్నాయి. వసంతపంచమి,మాతృమూర్తుల గొప్పతనం,చదువు యొక్క ఆవశ్యకత తదితర విషయాలను పాఠశాల కార్యదర్శి మత్స్యేంద్రనాథ్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు ఆంజనేయులు,జిల్లా కార్యకారిణి సభ్యులు సవితారాణి,ప్రబంధకారిణి అధ్యక్షులు గంజి శ్రీనివాస్,సమితి అధ్యక్షులు నర్సింగ్ రావ్ కులకర్ణి,ఉపాధ్యక్షులు చోళ పవన్ కుమార్,ప్రధానాచార్యులు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.