Home News ఇవీ జమ్ము – కాశ్మీర్ కు సంబంధించిన మార్పులు

ఇవీ జమ్ము – కాశ్మీర్ కు సంబంధించిన మార్పులు

0
SHARE

1. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం రద్దయింది.
2. జమ్ము కాశ్మీర్ కు విడిగా జెండా ఏది ఉండదు. 
3. జమ్ము కాశ్మీర్ నియోజక వర్గాల పునర్ విభజన జరుగుతుంది. 
4. జమ్ము కాశ్మీర్ లో అమలులో ఉన్న ఆర్టికల్ 35ఏ రద్దయింది. 
ఇక దళితులు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్ధులు, గూర్ఖాలు, మహిళలకు కూడా పూర్తి హక్కులు లభిస్తాయి. 
5. జమ్ము కాశ్మీర్ లోని షెడ్యూల్ జాతులవారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లభిస్తాయి. 
6. మూడంచల పంచాయతీ రాజ్ వ్యవస్థ జమ్ము కాశ్మీర్ లో కూడా అమలవుతుంది. 
7. రాజ్యాంగపు పీఠికలో పేర్కొన్న అన్నీ అంశాలు ఇక జమ్ము కాశ్మీర్ కు కూడా వర్తిస్తాయి. ఇంతకు ముందు పీఠికలోని సెక్యులర్, అఖండత అనే పదాలు ఈ ప్రాంతానికి వర్తించేవి కాదు. 
8. భారత రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కు ఇక ఈ ప్రాంతంలోని వారికి కూడా లభిస్తుంది. 
9. జమ్ము కాశ్మీర్ శాసన సభ కాలవ్యవధి 6 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది. 
10. జమ్ము కాశ్మీర్ లో పదవి బాధ్యతలు స్వీకరించే న్యాయమూర్తులు, మంత్రుల ప్రమాణస్వీకార పత్రంలో ఇక మీదట భారతీయ రాజ్యాంగం పట్ల నిష్టతో అనే మాట చేరుస్తారు. 
11. మిగిలిన బలహీన, వెనుకబడిన వర్గాలకు కూడా జమ్ము కాశ్మీర్ లో హక్కులు లభిస్తాయి. 
12. జమ్ము కాశ్మీర్ లో ఇప్పుడున్న గవర్నర్ బదులు లెఫ్టినెంట్ గవర్నర్ పదవి ఉంటుంది. 
13. ప్రస్తుతపు జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని ఇక రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పరిగణిస్తారు. 
       1. జమ్ము కాశ్మీర్ : 2. లఢక్
14. ఇక దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఎవరైనా జమ్ము కాశ్మీర్ కు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చును.