Home News జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

0
SHARE

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 18 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు.

అవంతీపురా సెక్టార్ సమీపంలోని గోరీపురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి దాడికి పాల్పడ్డారు.

70 వాహనాలతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో జరిపిన ఈ దాడిలో ఒక వాహనం దాడికి గురైంది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో మృతిచెందిన జవాన్ల సంఖ్య సుమారు 18గా వివిధ మీడియా కధనాల ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్యపై ఇంకా కచ్చితమైన అధికారిక సమాచారం లేదు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో ఒక స్కార్పియో వాహనంలో ఐఈడీ బాంబులను అమర్చినట్టు తెలుస్తోంది. కాన్వాయ్ బాంబు అమర్చిన వాహన సమీపంలోకి రాగానే ఉగ్రవాదులు దాన్ని పేల్చివేసినట్టు సమాచారం. దాడిలో స్థానిక ఉగ్రవాదులు పాల్గొన్నారని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు సరిహద్దు అవతలి నుంచి వఛ్చిన తీవ్రవాదులు దాడులకు పాల్పడుతుంటే ఇప్పుడు స్థానికులే ఇలాంటి భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడటం ఆందోళన కలిగించే విషయమని విశ్లేషకులు అంటున్నారు. తీవ్రవాదులు చనిపోతే గగ్గోలుపెట్టి, సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై, భద్రతాదళాలపై విమర్శలు చేసే మేధావులు, వేర్పాటువాదులు, పార్టీలు ఈ దాడిపై ఎలాంటి ప్రతిస్పందన తెలియజేయకపోవడం గమనార్హం.