Home News రాజకీయ నిరసనల్లో బడిపిల్లలు .. చర్చి పాఠశాలలపై లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ ఫిర్యాదు

రాజకీయ నిరసనల్లో బడిపిల్లలు .. చర్చి పాఠశాలలపై లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ ఫిర్యాదు

0
SHARE
మిజోరం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ  (సిటిజెన్షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్) చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సాగిస్తున్న నిరసన ప్రదర్శనల్లో పాఠశాల పిల్లలు  కూడా పాల్గొనేలా ప్రోత్సహించడంపై చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పాఠశాలలపై ఫిర్యాదు నమోదైంది.
ఈమేరకు లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ (ఎల్.ఆర్.ఓ) సంస్థ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయానికి చేసిన ఫిర్యాదులో చర్చి ఆధ్వర్యంలోని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. గతకొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పౌరసత్వ సవరణ చట్టం-2016ను వ్యతిరేకిస్తూ చర్చి ఆధ్వర్యంలో అనేక ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మిజోరోంలో జరుగుతున్న ఈ ఆందోళనల్లో పాఠశాలల పిల్లలను కూడా భాగస్వాములను  చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ చర్చి ఆద్వర్యంలోని పాఠశాలలు తమ రాజకీయ అభిప్రాయాలు  చిన్నపిల్లలపై రుద్దుతున్న విషయాన్నీ  కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నుండి వివరణ తీసుకోవడంతో పాటు ఈ ఉదంతంపై విచారణ నిర్వహించి సదరు పాఠశాలలపై ‘బాలల హక్కుల చట్టం’ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎల్.ఆర్.ఓ కమిషన్ ను  కోరింది.