Home News క్రైస్తవ గృహంలో బాలికలపై లైంగిక దాడి.. కలెక్టర్ తినిఖీల్లో వెలుగుచూసిన నిజాలు  

క్రైస్తవ గృహంలో బాలికలపై లైంగిక దాడి.. కలెక్టర్ తినిఖీల్లో వెలుగుచూసిన నిజాలు  

0
SHARE
తమిళనాడులోని తిరువన్నామలైలో క్రైస్తవ మిషనరీ సంస్థ నిర్వహిస్తోన్న మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ అనే అనాధ బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ కెఎస్ కందస్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే నిజాలు వెలుగుచూశాయి.  అక్కడి బాలికలపై కొంతకాలంగా లైంగిక దాడి జరుగుతున్నట్టు కలెక్టర్ గుర్తించారు.
మొదట మిషనరీ హోమ్ వసతి గృహంలో నవంబర్ 17న ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ అక్కడ సరైన వసతులు లేకపోవడం గుర్తించి అందులో ఉంటున్న బాలికలను ఇతర ప్రభుత్వ మరియు మెరుగైన వసతి సౌకర్యం ఉన్న ప్రయివేటు వసతి గృహాలకు తరలించారు.
కానీ నవంబర్ 24వ తేదీ నాడు బాలికలు తరలించబడిన ప్రభుత్వ వసతి గృహం యొక్క వార్డెన్ నుండి హఠాత్తుగా కలెక్టర్ కి ఫోన్ కాల్ వచ్చింది. మిషనరీ హోమ్ నుండి ఇక్కడికి వచ్చిన బాలికల్లో ముగ్గురు కలెక్టర్ తో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నట్టు వార్డెన్ తెలిపారు. దీంతో తిరువన్నామలై జిల్లా కలెక్టర్ కందస్వామి అక్కడికి చేరుకొని ఆ బాలికలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలికలు దారుణ నిజాలు కలెక్టర్ కందస్వామికి వివరించి బోరున విలపించారు. తమపై గత కొన్ని సంవత్సరాలుగా మిషనరీ హోమ్ నిర్వాహకులు లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్న విషయాన్ని కలెక్టరుకు తెలిపారు.
14 నుండి 15 ఏళ్ల వయసు గల ఆ ముగ్గురు బాలికలు అక్కడి నిర్వాహకుడైన లూబన్ కుమార్ తమపై అత్యాచారాలు జరిపినట్టు వారు వివరించారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే లూబన్ కుమార్ భార్య మెర్సీ రాణి మరియు సోదరుడు జస్టిన్ లకు కూడా ఈ విషయం తెలుసుననీ, ఇందుకు వారి సహకారం కూడా ఉందని వారు కలెక్టరుకు అన్నారు.
కలెక్టర్ మొదటిసారి అక్కడికి తనిఖీలకు వెళ్ళినప్పుడు అక్కడి స్నానగదులకు వేటికీ కూడా తలుపులు లేని విషయాన్ని గ్రహించారు. ఐతే వాటి గురించి వివరిస్తూ బాలికలు.. ఉద్దేశపూర్వకంగానే స్నాన గదుల తలుపులు తీసివేశారని, స్నాన గదులు లూబన్ కుమార్ పడక గదికి ఆనుకుని ఉంటాయని బాలికలు తెలిపారు. అంతే కాకుండా స్నానగదుల్లో సీసీ కెమెరాలు అమర్చారని బాలికలు తెలిపారు. వీటితో పాటు బాలికలను తన పడకగదిలోకి రప్పించుకుని సపర్యలు చేయించుకునేవాడని.. ఈ విషయాన్నీ అతడి భార్య మెర్సీ రానికి తెలుపగా.. అతడి భార్య, తమ్ముడు కలిసి దారుణంగా కొట్టేవారని వివరిస్తూ బాలికలు కలెక్టర్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కందస్వామి మాట్లాడుతూ.. ఆ బాలికలు తల్లిదండ్రులు లేరనే ధైర్యంతో వారు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని.. అందులో ఒక బాలిక తన నాన్నమ్మకి ఈ విషయం తెలుపగా, తన చదువులు పూర్తయ్యేదాకా భరించమని ఏడుస్తూ సలహా ఇచ్చిందని వివరించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లోకల్ పోలీసులు లూబన్ కుమార్, అతడి భార్య మెర్సీ రాణి, సోదరుడి జస్టిన్ లను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైస్తవ మిషనరీ హోమ్ ని ఆదివారం పోలీసులు సీజ్ చేశారు