షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు చెపట్టారు. అనంతరం షిల్లాంగ్‌లోని ఝలుపారా పోలీస్ ఔట్‌పోస్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 1, 2 తేదీల్లో రాత్రి జరిగిన ఈ సంఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేయాలని VHP డిమాండ్ చేసింది.
విరిగిన కాళీమాత విగ్రహాన్ని జనవరి 2న ఉదయం ఆలయ పూజారి తొలిసారిగా గమనించారని, ఈ ఘటన హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని వీహెచ్‌పీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని కూడా వీహెచ్‌పీ కోరింది. స్థానిక హిందువులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.