ప్రపంచంలోని భారతీయ హిందూ సమాజం ప్రాచీనమైనదని, సంస్కారవంతమైనది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. కుల రహిత సమాజాన్ని ఆర్ ఎస్ ఎస్ కోరుకుంటున్నదని, ఆ దిశలో తమవంతు ప్రయత్నాలు చేస్తున్నది అని కూడా అన్నారు.
ఆదివారం (21- జనవరి ) నాడు మారేడ్ పల్లి లోని పద్మశాలి కళ్యాణ మండపం లో ఆర్ ఎస్ ఎస్ నిర్వహించిన సద్భావన సదస్సు లో శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు ప్రధాన వక్తగా ప్రసంగించారు.
శ్రీ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ప్రపంచాన్ని అబ్బురపరిచే శ్రేష్ట మైన సామజిక వ్యవస్తలు ఇక్కడ వెలసిల్లాయని, కుల గ్రామా వృత్తి పరమైన సమానత్వ భావనను నిర్మాణం చేయటానికి ఆర్ ఎస్ ఎస్ అన్ని వర్గాల సమూహాలతో “సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సమాజంలో అస్పృశత పై మాట్లాడూతూ దీనికి సమాధానం ఇస్తూ హిందూ దేవతలు ఎక్కువగా నల్లగా ఉన్నారు అని, కులాల మద్య అడ్డుగోడలు తొలగాలని పిలుపునిచ్చారు. ఉదాహరణకు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి మొదలగువారు నిమ్న వర్గాలకు చెందిన వారైనప్పటికి వారు రచించిన గ్రంథాలు హిందువులందిరికి పుజనీయం అని అన్నారు.
ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక గుర్తింపు చెప్పుకుంటాం అలాగే భారత దేశం యొక్క గుర్తింపు హిందుత్వం అన్నారు. దేశంలో హిందుత్వం బలహీనపడితే దేశం బలహీనమవుతుంది. ఉదాహరణ ఇస్తూ పశ్చిమ బెంగాల్ లో మొత్తం 2700 గ్రామాలకు గాను, 8000 గ్రామాలలో ఒక్క హిందువు కూడా లేదు. ఈ దేశంలో ఒక్క హిందువు ఉన్న ఇది హిందుదేశంగనే పరిగణింపబడుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర సహా వ్యవస్థ ప్రముఖ్ శ్రీ సూర్య ప్రకాష్ గారు, సికంద్రాబాద్ గణపతి ఆలయం చైర్మన్ పిట్ల నగేష్, ఉజ్జయిని మహంకాళి, మరియు పలు దేవాలయాల పాలక మండలి సభ్యులు, కుల సంఘాల నాయకులు, కాలని, బస్తిల అధ్యక్షులు, ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.