ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవలు మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.
పాంగాంగ్ దక్షిణ అంచున ఉన్న మెరాక్, ఖక్టేడ్ గ్రామంలో మొట్టమొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ ప్రారంభమైంది. మెరాక్ వద్ద బి.ఎస్.ఎన్.ఎల్ టవర్ ను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాన్జిన్ ప్రారంభించారు.
ఇటీవల, చైనాతో ఉద్రిక్తతల పరిస్థితుల నడుమ తూర్పు లడఖ్‌లో సైన్యానికి మద్దతు అవసరమైనప్పుడు సరిహద్దు ప్రాంతాల గ్రామస్తులు భారత సైన్యంతో నిలబడ్డారు. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు కూడా గ్రామస్తులు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఆపరేషన్ సద్భావన వల్ల పరిస్థితులు సాధారణమైతే గ్రామస్తుల దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకోవడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు ఆర్మీ సమక్షంలో బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు.
మొబైల్ కనెక్టేవిటికి కావాల్సిన అన్ని పరికరాలను బి.ఎస్.ఎన్.ఎల్ అందించింది. అలాగే చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ఈ ప్రాజెక్టుకు సౌర శక్తి వ్యవస్థను అందించారు. చుషుల్, చాంగ్‌తాంగ్‌లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Source : ORGANISER