Home News హిందూ మత పరిరక్షణకు ఐక్యంగా కృషిచేద్దాం : విశ్వహిందూ పరిషత్తు ధర్మాచార్య సమ్మేళనం

హిందూ మత పరిరక్షణకు ఐక్యంగా కృషిచేద్దాం : విశ్వహిందూ పరిషత్తు ధర్మాచార్య సమ్మేళనం

0
SHARE

అన్నవరంలో విశ్వహిందూ పరిషత్తు ధర్మాచార్య సమ్మేళనం

విశ్వహిందూ పరిషత్తు ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో ధర్మాచార్య సమ్మేళనం మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 50 మందికి పైగా స్వామీజీలు (కాషాయ, శ్వేత వస్త్రదారులు) హాజరయ్యారు. రాష్ట్ర కార్యాధ్యక్షులు వబిలిశెట్టి వేంకటేశ్వర్లు, గోరక్ష ప్రముఖ్‌ యాదగిరిరావు, కేంద్రీయ సహకార్యదర్శి సత్యంజీ తదితర అనేక మంది ప్రముఖులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

‘మఠ-మందిర వ్యవస్థ’ అనే అంశంపై చర్చలో భాగంగా దేవాలయాల పరిరక్షణపై కార్యాచరణ ప్రకటించారు. కేంద్రం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా ప్రయోజనాలు పొందడం, గో సంరక్షణ తదితర విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తిరుపతి దేవస్థానంలో ప్రస్తుత పరిస్థితులు, పరిపూర్ణానంద సరస్వతి భాగ్యనగర బహిష్కరణ అంశాలపై స్వామీజీలు అభిప్రాయం తెలిపారు.

మత మార్పిడిలను నిరోదిద్దామని, మతం మారిన వారిని హిందువులుగా మార్చేందుకు అంతా ఐక్యంగా కృషిచేయాలని తీర్మానించారు. దేవస్థానం ఈవో ఎం.జితేంద్ర, ధర్మకర్తల మండలి సభ్యుడు సింగిల్‌దేవి సత్తిరాజు, పీఆర్వో తులారాముడు, ఏఈవో ఎం.కె.టి.ఎన్‌.వి. ప్రసాద్‌, విశ్వహిందూ పరిషత్‌ ముఖ్యులు కేశవ్‌హెగ్డే, తిరుపతిరావు, శివశంకర్‌, అప్పాజీ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఈనాడు సౌజన్యం తో)