- కేంద్ర నిఘా వర్గాల ఆదేశాలతో హైదరాబాద్ పోలీసుల అప్రమత్తం
భారత్ కు వలస వస్తున్న రోహింగ్యా శరణార్దుల్లో కొందరు అక్రమంగా పౌరసత్వాలు పొండుతున్నరంటూ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ వ్యాప్తంగా వేరున్న చోట్ల జారి అయిన అక్రమ పాస్ పోర్టులు , ఓటర్, ఆదార్ కార్డుల వివరాలను కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ట్రాలకు పంపించాయి. ఆ జాబితా ఆధారంగా పోలిస్ ఉన్నతాదికారులు వారిపై నిఘా ఉంచి చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదు వేల మందికి పైగా రోహింగ్యాలు హైదరాబాద్ పాత బస్తి, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీరిలో కొందరు తప్పుడు ధ్రువ పత్రాలు పొందుతున్నారు.
బాలాపూర్ లో మూడేళ్ళ నుంచి నివాసముంటున్న ఇద్దరు రోహింగ్యాలు.. మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ ఫైజల్ నయీం అనే పాస్ పోఅర్ట్ ఏజంట్ కు రూ .25 నుంచి రూ 50 వేలు వరకు డబ్బులు చెల్లిస్తూ తమ వారికి పాస్ పోర్ట్ లు వచ్చేలా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వారి నుంచి పదుల సంఖ్యలో ఆధర్, ఓటర్, పాన్ కార్డు లను స్వదీన్ చేసుకున్నారు.
విద్యార్హత దృవీకరణ పత్రాలు..: మహమ్మద్ ఫయాజ్..పాస్పోర్ట్ పొందేందుకు పథ బస్తీలో నివాసం ఉన్నట్లు చిరునామా సృష్టించాడని తేలింది. అతడితో పాటు మరికొందరు కూడా పాన్ కార్డులు పొందరంటూ అనుమానం రావడం తో హైదరాబాద్ పోలిస్ ప్రత్యేక విభాగం అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలో యాభై మంది రోహింగ్యా లు అక్రమంగా పాస్పోర్టులు పొందేందుకు విద్యార్హతల దృవీకరణ పాత్రలను కొనుగోలు చేశారన్న అధరాలు లభించాయి. ఆ పాత్రలతో వీరు పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకొనే లోపే పోలీసులు వాటిని స్వాదీనం చేసుకొని సమకూర్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు.
పాకిస్థానీ ఇక్రం…ఏడేళ్లు హైదరాబాద్ లో ఏం చేశాడు?
కొనసాగుతున్న పోలీసుల పరిశోధన; పంజాబ్ ప్రావిన్స్ పాస్‌పోర్టు స్వాధీనం
తప్పుడు పత్రాల సాయంతో భారత పాస్‌పోర్టు సంపాదించిన పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రం… హైదరాబాద్‌లో ఏడేళ్లుగా ఏం చేస్తున్నాడన్న అంశంపై సైబర్‌క్రైం పోలీసులు పరిశోధన కొనసాగిస్తున్నారు. భారత పాస్‌పోర్టును అక్రమంగా సంపాదించడం దేశభద్రతకు సంబంధించిన అంశం కావడంతో అప్రమత్తమయ్యారు. అతడి భార్యకు ఈ వ్యవహారం తెలిసినా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అనే ప్రశ్నను పోలీసులే వేసుకుని కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఇక్రం ఉంటున్న ఇంట్లో కొద్ది రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. పాకిస్థాన్ జారీ చేసిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇక్రం నివాసం ఉంటున్నట్టు ఆ పాస్‌పోర్టులో వివరాలున్నాయి. ఆ పాస్‌పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సైబర్ క్రైం అధికారులు లేఖ రాశారు. పాకిస్థాన్ నుంచి ఎనిమిదేళ్ల క్రితం ఇక్రం దుబాయ్ వెళ్లాడు. అక్కడ చాదర్‌ఘాట్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె హైదరాబాద్ వచ్చేశారు. కొద్దిరోజుల తర్వాత తానూ వస్తానంటూ ఇక్రం చెప్పాడు. దుబాయ్ నుంచి నేపాల్‌కు విమానంలో వచ్చిన ఇక్రం అక్కడి నుంచి బస్సులో దిల్లీ చేరుకున్నాడు. భారత సరిహద్దు ప్రాంతంలో బస్సును రెండుసార్లు తనిఖీ చేసినా అక్కడి పోలీసులు ఇక్రంను పాకిస్థానీగా గుర్తించలేక పోయారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇక్రం భార్యతో కలిసి ఉన్నాడు. అక్రమంగా పాస్‌పోర్టు పొందాడు. కొంతకాలంగా ఇక్రం పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
విశ్వవిద్యాలయాల పట్టాలు మరిన్ని…
ఇక్రం పాస్‌పోర్టు పొందేందుకు అవసరమైన డిగ్రీ పత్రాలను రూ.50 వేలు తీసుకుని సమకూర్చిన వరంగల్ వాసి మక్సూద్ నుంచి మరిన్ని విశ్వవిద్యాలయాల పట్టాలను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారణాసి, కోల్‌కతా కేంద్రంగా కొనసాగుతున్న పదో తరగతి బోర్డు ధ్రువపత్రాలను తీసుకున్నారు. ఇక్రం డిగ్రీ పట్టాలు నిజమైనవా? కాదా? అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. వేర్వేరు విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ పట్టాల వివరాలను సేకరించేందుకు త్వరలో ఒక ప్రత్యేక బృందం ముంబయి, దిల్లీకి వెళ్లనుంది. అక్కడికి వెళ్లాక కిందిస్థాయి సిబ్బంది అసలైన పట్టాలను మక్సూద్‌కు ఇచ్చారా? లేదా మక్సూద్ నకళ్లను తయారు చేశారా? అన్న అంశాలపై స్పష్టత వస్తుందని సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు.
వ్యవహార శైలిపై రహస్య విచారణ!
హైదరాబాద్‌లో ఏడేళ్లుగా నివాసముంటున్న ఇక్రం వ్యవహార శైలిపై పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఏడేళ్ల నుంచి అతడు ఎన్ని చోట్ల పని చేశాడు? ఆ కాలంలో అతడిపై ఏవైనా ఆరోపణలు ఉన్నాయా? నెలకు ఎంత సంపాదించేవాడు? అనే వివరాలను ఇద్దరు పోలీసులు గోప్యంగా సేకరిస్తున్నట్టు సమాచారం. ఇక్రం ఒక్కోచోట సంవత్సరం కన్నా ఎక్కువగా పని చేయలేదు. ఉద్యోగం మానేసిన సంస్థ, కంపెనీ నుంచి పని చేసిన కాలానికి ధ్రువీకరణ పత్రాలు పొందాడు. వీటి సాయంతో సులభంగానే ఉద్యోగాలు సాధించాడు. పోలీసులు అరెస్ట్ చేసే ముందు కల్యాణ్ ఆర్ట్స్ సంస్థలో పరిపాలన విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో కల్యాణ్ ఆర్ట్స్ సంస్థ యాజమాన్యం నుంచి మొదలు పెట్టి మిగిలిన సంస్థలు, కంపెనీల ప్రతినిధుల దగ్గరకు వెళ్లి మాట్లాడనున్నారు. ఏడేళ్లలో అతడు వినియోగించిన సిమ్‌కార్డుల ద్వారా అతడితో పరిచయం ఉన్న వ్యక్తులు, సంస్థల కాల్‌డేటా రికార్డులను పరిశీలించనున్నారు. మరోవైపు అక్రమంగా భారత పాస్‌పోర్టు పొందిన ఇక్రం… మధ్యలో మూడునెలల పాటు సింగపూర్‌లో ఉన్నాడు. అక్కడ సంగీత కచేరీలు నిర్వహించే బృందంలో సహాయకుడిగా పని చేశాడని పోలీసులు ఆధారాలు సేకరించారు.
(ఈనాడు సౌజన్యం తో)