పత్రికను ఆయుధంగా చేసుకొని స్వరాజ్య సిద్ధి, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం పోరాటం జరిపిన స్వాతంత్ర్య సమరయోధుల్లో మద్దూరి అన్నపూర్ణయ్య ఒకరు. మడమతిప్పని ఆ పోరాటంలో 42వ సంవత్సరం వచ్చేనాటికి ఆయన 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 33 సంవత్సరాల కాలానికి జరిపిన స్వరాజ్య సమరంలో, దాదాపు 15 సంవత్సరాలు మద్దూరి అన్నపూర్ణయ్య జైలులోనే గడిపారు. ఏకైక కుమార్తె పెళ్లికీ, భార్య వెంకటరమణమ్మగారి మరణం సమయంలో కూడా పెరోల్ దొరక్క ఆయన జైలులోనే ఉండిపోయారు.