
ఉద్దంసింగ్
జలియ వాల బాగు జనులజంపినయట్టి
డయ్యరునకు మరణ శయ్య జూప
సిద్ద మయ్యి చంపె ఉద్దమ సింగము
వినుర భారతీయ వీర చరిత
భావము
జలియన్‌వాలాబాగ్‌లో దారుణంగా ప్రజలను పొట్టనపెట్టుకున్న డయ్యర్‌కు మరణశిక్ష విధించడానికి శపథం చేశారు. 12 సంవత్సరాలు వేచి చూశారు. డయ్యర్ ఇంగ్లండ్‌లో ఉండగా, అతడు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి, అతడిని కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు ఉద్దం సింగ్ చరిత్ర విను ఓ భారతీయుడా!
-రాంనరేష్