Home News మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. మద్రాసు హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. మద్రాసు హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

0
SHARE
https://upload.wikimedia.org/wikipedia/commons/c/c9/A_building_in_Chennai.JPG
  • మ‌తం మార‌డంతో ఉద్యోగ‌ మెరిట్ కొల్పోయిన వ్య‌క్తి
  • TNPSC ని స‌వాలు చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ కొట్టివేసిన హైకోర్టు

ఒక వ్యక్తి మరో మతంలోకి మారిన తర్వాత తన అస‌లు కుల ద్రువీక‌ర‌ణ‌ను కొల్పొతాడ‌ని, అలాగే రిజ‌ర్వేష‌న్ కూడా వ‌ర్తించ‌ద‌ని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచ‌ల‌న‌ తీర్పునిచ్చింది. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారి బీసీ రిజర్వేషన్ కోసం ఒక వ్య‌క్తి దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్ ను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్య చేసింది.

కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-II (గ్రూప్-II సర్వీసెస్)లో బీసీ కేట‌గిరికి బదులుగా ‘జనరల్’ కేటగిరీగా తనను పరిగణిస్తూ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) చర్యను సవాలు చేస్తూ పిటిషనర్ దాఖ‌లు చేసిన పిటిషన్‌ను జస్టిస్ GR స్వామినాథన్ డిసెంబర్ 1న తోసిపుచ్చారు.

హిందువుగా జన్మించిన ఒక వ్యక్తి కుల వ్యవస్థను అనుసరించని లేదా గుర్తించని మరో మతంలోకి మారిన తర్వాత, ఇక‌పై తాను పుట్టిన కులానికి చెందినవాడు కాదని జస్టిస్ స్వామినాథన్ అనేక సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. కైలాష్ సోంకర్ VS మాయా దేవి కేసులో హిందువు కులం వ్య‌క్తి పుట్టుక‌ను బట్టి నిర్ణయించబడుతుందని సుప్రీంకోర్టు తీర్పును ఉద‌హ‌రించారు. అందువల్ల ఒక హిందువు క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారితే లేదా కుల వ్యవస్థను గుర్తించే మరేదైనా మతంలోకి మారితే, అతను లేదా ఆమె ఆ కులానికి చెందినవారు కాద‌ని, అస‌లు మతానికి తిరిగి వచ్చిన తర్వాతనే అతను మొదట జన్మించిన కులానికి చెందుతాడ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

TNPSC నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. మతం మారిన వ్యక్తి కమ్యూనిటీ రిజర్వేషన్‌కు అర్హుడా లేదా అనే అంశం సుప్రీంకోర్టులో ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని, ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం తీసుకోవడం సరికాద‌ని హైకోర్టు పేర్కొంది.

అయితే పిటిషనర్ త‌న‌ కుటుంబం అత్యంత వెనుకబడిన తరగతి (ఎంబిసి)కి చెందిన హిందూ కుటుంబ‌మ‌ని హైకోర్టుకు తెలిపారు. అయితే 2008 మేలో పిటిషనర్ అతని కుటుంబం ఇస్లాంలోకి మారారు. 2018లో తమిళనాడు కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. మెరిట్ జాబితాలో అత‌న్ని చేర్చ‌క‌పోవ‌డంతో RTI ద్వారా వివ‌ర‌ణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా దీనికి ప్రతిస్పందనగా “TNPSC అతన్ని వెనుకబడిన తరగతి ముస్లిం దరఖాస్తుదారుగా కాకుండా సాధారణ-కేటగిరీ దరఖాస్తుదారుగా పరిగణించిందని వెల్లడించింది.

ఇస్లాంలోకి మారడం ద్వారా, తాను కోరుకున్న ఏ మతాన్ని అయినా ఆచరించాలనే ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, అతను మ‌తం మారడానికి ముందు తమిళనాడు రాష్ట్రం కొన్ని ముస్లిం వర్గాలను వెనుకబడిన తరగతికి చెందిన వారిగా గుర్తించింది. వెనుకబడిన తరగతుల కమ్యూనిటీలో తన అభ్యర్థిత్వాన్ని TNPSC పరిగణించవలసి ఉందని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది TN ప్రభుత్వం ముస్లింలందరినీ వెనుకబడిన తరగతికి చెందిన వారిగా గుర్తించలేదని పేర్కొంది.