Home News రాజ‌స్థాన్‌ లో సామూహిక మతమార్పిడులు అడ్డుకున్న ధర్మజాగరణ్ మంచ్

రాజ‌స్థాన్‌ లో సామూహిక మతమార్పిడులు అడ్డుకున్న ధర్మజాగరణ్ మంచ్

0
SHARE

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 400 మంది హిందువుల మతమార్పిళ్ల ఘ‌ట‌న త‌ర్వాత రాజస్థాన్ లో కూడా మ‌త‌మార్పిళ్ల‌కు సంబంధించిన వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఇక్కడ వరుస సంఘటనలలో సామూహిక మతమార్పిళ్లు జ‌ర‌గుతున్న‌ట్టు గుర్తించిన ‘ధర్మ జాగరణ్ మంచ్’ రాజస్థాన్‌లో మతమార్పిళ్ల వ్య‌వ‌హ‌రాన్ని వెలుగులోకి తెచ్చింది.

రాజస్థాన్‌లోని క్రైస్తవ మిషనరీలు దాదాపు 3 లక్షల మంది హిందువులను మతం మార్చే లక్ష్యంతో వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారని ‘ధర్మ జాగరణ్ మంచ్’ వెల్ల‌డించింది. జైపూర్ నగరానికి 22 కి.మీ దూరంలో ఉన్న వాటికా గ్రామంలో ధని భైరవలో క్రిస్టియన్ మిషనరీలు చాలా చురుకుగా ఉన్నారని. ఈ స్థలంలో 400 హిందూ కుటుంబాలను మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నార‌ని సంస్థ పేర్కొంది. విగ్రహారాధనను ఆపాల‌ని, వివిధ ఆచారాలను అనుసరించకూడద‌ని, హిందూ దేవతలను విశ్వసించకూడద‌ని క్రైస్త‌వ మిష‌న‌రీలు బెందిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ధ‌ర్మ జాగ‌ర‌ణ్ మంచ్ పేర్కొంది.

ఇక్క‌డి నివాసితుల తెలిపిన‌ ప్ర‌కారం “యేసుక్రీస్తును ఆరాధించడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కార‌మ‌వుతాయ‌ని, హిందూ దేవతలను ఆరాధించడం వినాశనానికి దారి తీస్తుంద‌ని అస‌త్య‌ ప్ర‌చారాలతో పాటు, దేవతా విగ్రహాలను నదులలో లేదా సరస్సులలో విసిరేస్తే హిందువులకు ఉద్యోగాలు ఇస్తామని క్రైస్తవ మిషనరీలు వాగ్దానం చేస్తున్నాయ‌ని తెలిపారు.

హిందూ వ్యతిరేక సందేశాలను ప్రచారం చేయడం ద్వారా క్రైస్తవ మిషనరీలు ఆర్థికంగా వెనుకబడిన సమాజాల నుండి దళితులను, ఇతర ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. క్రైస్త‌వ మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తి ఆధ్వ‌ర్యంలో అక్టోబర్ 28న, ఒక పెద్ద కార్యక్రమం జరిగింద‌ని, అక్కడ ప్రార్థ‌న‌ల పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలను గుమిగూడి, వారిని క్రైస్తవ మతంలోకి మార్చడానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, దాదాపు 500-600 కుటుంబాలు చిక్కుకుపోయాయ‌ని స్థానికులు వెల్ల‌డించారు. బొట్టు, గాజులు, కంకణాలు ధరించవద్దని, పూజలు చేయవద్దని, దేవతలు పూజల సమయంలో మాంసాహారం తీసుకోమని ప్రజలను ప్రోత్సహించే వాడ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా హిందువులంతా ఉద్య‌మించినా, ఇప్ప‌టికీ ఆయ‌నను పోలీసులు ప‌ట్టుకోలేద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇన్ని జ‌రుగుతున్నా త‌మ ప్రభుత్వానికి ఎటువంటి స‌మాచారం అందలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి మతమార్పిడులు సాధారణంగా జరుగుతున్నాయని చెప్ప‌డం వెన‌క రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. రాజస్థాన్ పోలీసులు కూడా నవంబర్ 9న ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేశారు. జైపూర్‌లో మతమార్పిడులు జరగలేదని, మతమార్పిడి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని పోలీసులు తెలిపారు. జైపూర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) యోగేష్ గోయల్ మాట్లాడుతూ మతమార్పిడి జరగలేదని లేదా మతమార్పిడి కోసం ఎవరూ ప్రయత్నించలేదని చెప్పారు.

క్యాబినెట్ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ కూడా జైపూర్‌లో మతమార్పిడి సంఘటన జరగలేదని, ప్రతిపక్ష బిజెపి పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. అయితే, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడిపై కఠిన చర్యలు తీసుకోలేదని బిజెపి సీనియర్ నాయకుడు అసెంబ్లీ ప్రతిపక్ష ఉప నాయకుడు రాజేంద్ర రాథోడ్ ఆరోపించారు.