Home News ముచ్చింత‌ల లో సామాజిక స‌మ‌ర‌స‌త స‌ద‌స్సు

ముచ్చింత‌ల లో సామాజిక స‌మ‌ర‌స‌త స‌ద‌స్సు

0
SHARE

ఫిబ్రవరి 10న ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామీజీ ఆశ్రమం లో సామాజిక సమరసత సదస్సు జరిగింది. ఈ స‌ద‌స్సులో 20రాష్ట్రాల నుండి సుమారు 180 మంది వివిధరంగాలలో పని చేస్తున్న విద్యావంతులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా చిన జీయర్ స్వామీజీ ఆశీ: ప్రసంగం చేస్తూ దీన జన సేవలో నిమగ్నమైన పనిచేయడంలో భగవత్ రామానుజాచార్య నుండి ప్రేరణ పొందాలని, సకల జీవ రక్షణకు కంకణం కట్టుకుని నిరంతరం పనిచేయాలని, సమరసత, సమత భౌతిక పదం కాదని మానసిక తత్వం అని సూచించారు. ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత సదస్యులు శ్రీ భాగయ్య అఖిల భారత సంయోజకులు శ్రీ శ్యామ్ ప్రసాద్, సహ సంయోజక్ రవీంద్ర కీర్కోలే, చిలుకూరు బాలాజీ అర్చకులు శ్రీ రంగరాజన్ పాల్గొన్నారు.

సంవత్సరాలుగా వివిధ రంగాల్లో వెనుక బడి వున్న ప్రజల వికాసం, భాగస్వామ్యంతో సమాజం లో సమరసత సాధించాలని స్వామీజీ కోరారు. రామానుజాచార్య అట్టడుగు అణగారిన వర్గాల వారిలో భక్తి భావన నింపిన ఘనత వారిదని స్వామీజీ అన్నారు.