Home Telugu Articles ఆర్టికల్ 370 రద్దు : నెహ్రూ అనుకున్న పనిని చేసి చూపిన మోడీ

ఆర్టికల్ 370 రద్దు : నెహ్రూ అనుకున్న పనిని చేసి చూపిన మోడీ

0
SHARE

ఎస్.గురుమూర్తి

పార్లమెంట్ లో ఆగస్టు 6 న హోంమంత్రి అమిత్ షా, ఆర్టికల్ 370  రద్దును  ప్రకటించిన తర్వాత కాశ్మీర్ మిగతా భారతదేశంతో పూర్తిగా కలిసిపోయింది, సరిగ్గా 56 సంవత్సరాల క్రితం డిసెంబర్ 27, 1963 న జవహర్ లాల్ నెహ్రూ లోక్ సభలో చెప్పి చేయలేక పోయిన విషయాలను అమిత్ షా చేసి చూపారు.నెహ్రూ ఆనాడు ఏమి చెప్పరో చూద్దాం.

ఆర్టికల్ 370 రద్దు అయింది కాశ్మీర్ పూర్తిగా భారత్ లో కలసిపోయింది: నెహ్రూ

కాశ్మీర్లో అమలులో ఉన్నఅవసరం లేని ఆర్టికల్ 370 రద్దు అయింది కాశ్మీర్ పూర్తిగా భారత్ లో కలసి పోయింది అని పార్లమెంట్ లో పండిట్ నెహ్రూ  ప్రగల్భాలు పలికాడు. నెహ్రూ సహచరుడు, అప్పటి హోం మంత్రి గుల్జారీలాల్ నందా ఒక అడుగు ముందుకు వేసి ఆర్టికల్ 370 ఇంక ఎంత మాత్రం పని చేయదని, అందులో ఇప్పుడు ఏమీ లేదని, దాన్ని ఎప్పుడు తొలగించాలనేది మన చేతిలో విషయం అది ఒక రోజులో లేదా పది రోజుల్లో లేదా పది నెలల తరువాత ఎప్పుడైనా తొలగించవచ్చు అని పార్లమెంట్ లో ప్రకటించాడు.తాత్కాలికమైన, సందర్భాన్ని బట్టి మార్పుచేసే అవకాశం ఉన్న ఈ నిబంధనను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించాడు,ఇది నెహ్రూ నాయకత్వంలో చివరి ప్రకటన.

కాశ్మీర్, టిబెట్, చైనా విషయంలో పటేల్ నిర్ణయాలను పట్టించుకోకుండా, అవమానించిన ఉదారవాద నెహ్రూ ,దశాబ్దం తర్వాత ఉదారవాదం నుండి జాతీయత వైపు మొగ్గు చూపారు దానికి కారణం  చైనా ప్రభావం. పండిట్ నెహ్రూ రాజకీయ ఊహలపై చైనా యుద్ధం మిగిల్చిన అవమానకరమైన ఓటమి ప్రభావం చూపింది. ఈ విషయంలో తనకు బద్ద శత్రువైన జాతీయవాద ఆర్.ఎస్.ఎస్ ను 1963వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడమే కాక, కాషాయ జెండా ఎగరడానికి ఒక్క అంగుళం స్థలం కూడా ఇవ్వను అన్న నెహ్రూ, 1948లో గాంధీజీ హత్యకు కారణమని ఆర్.ఎస్.ఎస్ పై నిషేధం విధించిన నెహ్రూ,యు టర్న్ తీసుకున్న విషయం అందరూ చెప్పుకునే సజీవ సాక్ష్యం.

ఉదారత్వాన్ని తనదిగా భావించిన నెహ్రూని 1962 యుద్ధం జాతీయవాదం వైపు తోసింది . మొదట జాతీయవాదం ఆ తర్వాతే ఉదారవాదం అనే ఆలోచనకి మార్చింది. కానీ 1963లో మొదటిసారి వచ్చిన గుండెపోటు వల్ల నెహ్రూ ఆరోగ్యం క్షీణించడమే కాక,ఆ తర్వాత 1964 జనవరిలో, చివరగా 1964 మే లో వచ్చిన చివరి గుండెపోటుతో మరణం సంభవించింది. దీనితో తను చేసిన ఘోర తప్పిదాన్ని సరిచేసుకునే అవకాశమే లేకుండా పోయింది. దానికి ఫలితమే ఈ రోజు పరిస్థితి. రోజులలో కానీ, నెలలలో కానీ రద్దు చేస్తామని హోం మంత్రి నందా చేసిన ప్రకటనను ఈనాటికీ ఆరు దశాబ్దాలుగా జాతీయ కాంగ్రెస్నెరవేర్చలేదు , ఆర్టికల్ 370 ని సరిదిద్దలేదు.

వామపక్ష కాంగ్రెస్ గా మారిన జాతీయ కాంగ్రెస్ 

నెహ్రూ, నందా  ప్రకటనను కాంగ్రెస్ ఎందుకు అనుసరించలేదు? ఇంకా అధ్వాన్నంగా, నెహ్రూ స్వయంగా కోరుకున్నది చేయకుండా, నెహ్రూ తరువాత కాంగ్రెస్ ఆర్టికల్ 370 ను కాశ్మీరియత్, ఉదారవాదం, లౌకికవాదం, సమాఖ్యవాదాలకు చిహ్నంగా మార్చింది. 1970 లఆరంభం నుండి కాంగ్రెస్ ను వామపక్షాలు స్వాధీనం చేసుకోవడమే జాతీయవాదం నుండి ఈ యు-టర్న్ కు కారణం.

వామపక్షాలకు (అవిభక్త సిపిఐ) దేశ వ్యతిరేక చరిత్ర ఉంది. ఇది రెండు కారణాల వల్ల విభజనకు మద్దతు ఇచ్చింది –అందులో ఒకటి, హిందువులు ముస్లింలను హింసిస్తారని; రెండు, ముస్లిం లీగ్ ఒక అసంబద్ధభావజాల జిన్నా నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడం. రాజ్యాంగాన్ని అంతర్గతంగా  విచ్ఛిన్నం చేయడానికి న్యాయశాఖ మంత్రిగా సహాయపడిన మోహన్ కుమారమంగళం, దేశ విచ్ఛిన్నానికి జవహర్ లాల్ యునివర్సిటీ ని ఆయుధంగా రూపొందించిన నూరుల్ హసన్ లాంటి సిపిఐ నాయకులు, ఈ దేశంరష్యా కనుసన్నల్లోఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.. ఆ సమయంలోనే జాతీయవాద కాంగ్రెస్ లౌకిక కాంగ్రెస్‌గా మారింది. ఇందిరా గాంధీ 1971 యుద్ధంలో విజయం సాధించి, సిమ్లా ఒప్పందం ద్వారా కాశ్మీర్‌ను ద్వైపాక్షిక సమస్యగా మార్చిన తరువాత, పాకిస్తాన్ మళ్లీ కె-పదాన్ని(కాశ్మీర్)లేవనెత్తదనిభావించింది.

ఇందిరా అతివిశ్వాసం ఆమెను 1974 లో షేక్ అబ్దుల్లాతోఒప్పందం కుదుర్చుకునెలా చేసింది, పండిట్ నెహ్రూ చేత ఆమోదింపబడిన ఆర్టికల్ 370 ను ఎత్తివేతప్రక్రియను సమర్థవంతంగా నిలిపివేసేలా చేసింది.హానికరమైందిగా పేరొందిన ఆర్టికల్ 370 నెమ్మదిగా పనికొచ్చేదిగా ఆ తరువాతభారత్,కాశ్మీర్ల మధ్య ఏకైక వారధిగాపరిణమించింది.1971 యుద్ధంలో ఓటమితో అవమానానికి గురైన పాకిస్తాన్ సైనిక నియంత జనరల్ జియా కాశ్మీర్‌పై తక్కువ ఖర్చుతో యుద్ధాన్ని ప్రారంభించడానికి యువతను జిహాదీలుగామలచి వ్యూహరచన చేశాడు.  భారత లౌకిక పాలకుల అసమర్థ పాలన, 370 ఆర్టికల్ ను లౌకిక దృష్టి తో చూడటం ,వంటివి ఈ దుష్ట వ్యూహానికి తోడై చివరకు 1980 ల చివరలో లోయను దాదాపుగా ఉగ్రవాదులమయంగా మార్చి, ఐదు లక్షల కాశ్మీరీ పండితులను తమ సొంత భూమిలోశరణార్థులనుచేసింది.

పాక్షికమైనప్పటికీ కాశ్మీర్‌ను తిరిగి పొందటానికి అప్పటి నరసింహారావు ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్  గవర్నర్ జగ్మోహన్ ఎంతో కృషి చేశారు. లౌకిక భారతీయ నాయకత్వంధైర్యాన్నిప్రదర్శించడంలో తన నిస్సహాయతను దాచిపెట్టడానికి, కాశ్మీర్‌ను భారత్‌తో నిలబెట్టుకోవడానికి  ఆర్టికల్ 370నే ఏకైక ఆశఅని పదేపదే కీర్తించింది. కాశ్మీర్‌లో ప్రధాన కుటుంబ పార్టీలు దోపిడీ చేయడానికి ఆర్టికల్ 370 ని  భద్రతా వలయంగా మార్చుకున్నాయి. హురియత్ బలహీనమైన దేశాన్ని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంది, అవహేళన చేసింది. 

ఇది పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను భారతదేశ ప్రధాన భూభాగం వైపు  మార్చడానికి ధైర్యం చేసేలా చేసింది. అప్పటికీ బలహీనమైన భారతీయ నాయకత్వం నిశ్శబ్దంగా బాధపడటాన్నే ఎంచుకుంది. 2008 లోపాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో మూడు రోజులలో వందలాది మందిని మారణహోమంలో చంపి, టీవీ తెరలపై తమ అనాగరికతను ప్రదర్శించినప్పుడు,పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకెళ్లకుండా శాంతి కోసం కొవ్వొత్తి  ఊరేగింపులను ప్రారంభించారుకాంగ్రెస్, వామపక్ష ఉదారవాదులు, ప్రజలను ఉద్రేకపడవద్దనిబుజ్జగించారు.ఈ భీభత్సానికి  కారణమైన  భస్మాసురతీవ్రవాదంతన సృష్టికర్త పాకిస్తాన్ మీదే తిరగబడింది. అతి దయగల భారతదేశం పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి  సృష్టికర్త కాదని, తన లాగే బాధితురాలని ధృవీకరించింది.అమెరికా నేతృత్వంలోని  సి.ఐ.ఎ,ఆపరేషన్ ద్వారా ఒసామా బిన్ లాడెన్‌నుపాకిస్తాన్ సురక్షిత గృహంలోచంపినప్పుడు టీవీల్లో వీక్షించిన ప్రపంచం మన అపరిపక్వతను చూసి నవ్వినప్పటికీ,భారత్మాత్రం ఉగ్రవాద వ్యాపారి పాకిస్తాన్‌తో తన శాంతి చర్చలకు పరిమితమైంది. వామపక్ష కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, నమ్మకద్రోహహురియత్, ఉగ్రవాదులతో శాంతి చర్చలను సమర్థించిందిమానవహక్కుల పరిరక్షణ  పేరిట సైన్యం మీద జరుగుతున్న దుష్ప్రచారానికి వత్తాసు పలికింది .పాలకుల అండతో , వేర్పాటువాదులు,ఉగ్రవాదులు కాశ్మీర్ రాజకీయాలను నియంత్రించారు. జాతీయవాద పార్టీ నుండి, కాంగ్రెస్ క్రమంగా ఉదారవాదుల,వామపక్షవాదుల బి-టీమ్‌గా మారింది, కాంగ్రెస్ ఖాళీచేసిన జాతీయవాదస్థానంలోకి వెళ్లడానికి బిజెపికి ఇది సహాయపడింది.

ఆర్టికల్ 370 రద్దు కోసం కసరత్తు

బిజెపికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు అనేది ఆకస్మిక చర్య కానే కాదు బాగా ఎప్పటినుండోఅలోచన చేసినప్రణాళిక.జమ్మూ కాశ్మీర్ లోకి  చొచ్చుకుపోయే బిజెపి ప్రణాళిక 2015 లో పి‌డి‌పి తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మొదలైంది దీనికి పి‌డి‌పి యొక్క స్వార్థ ప్రయోజనం కలిసి వచ్చింది. కేంద్రంలో, కాశ్మీర్‌లో బిజెపి అధికారంలో ఉండటం, ఉగ్రవాదుల  మెడలు వంచడానికి ఉపకరించింది.2016 వరకు గడచిన నాలుగేళ్లలో రాళ్ళమూక సంఘటనల సంఖ్య 3,415. ఇది 2017 లో కేవలం 51 కి పరిమితమైంది, కాగా2018 లో 15మాత్రమే నమోదయ్యాయి . ఉగ్రవాదుల ఎరివేత 44% శాతం పెరిగింది , వారి చేత చంపబడే వారి సంఖ్య 62.5%శాతం తగ్గింది ,గాయపడినవారు 94% తగ్గారు. కాశ్మీర్ లో పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించిన తర్వాత బిజెపి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని రాష్ట్రపతి పాలనను విధించింది. అంటే తమ పాలనే ఢిల్లీ నుండి కొనసాగించింది.కఠిన చట్టాల్నిఅమలు చేసి ఉగ్రవాదులు,వేర్పాటువాదులపై దాడి చేసి, వారిని ఆములాంతంపెకిలిచివేసింది.

హురియత్ పార్టీ, ఉగ్రవాదుల బెదిరింపుల మధ్య 2018 లో మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా బహిష్కరించిన పురపాలక ఎన్నికల్లో ఎన్నికలలో ఈ ప్రభావం ప్రముఖంగా కనిపించింది. మునిసిపల్ ఎన్నికలలో 58% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికలలో 80% ఓటు వేశారు. కాశ్మీర్ పురపాలక ఎన్నికల్లోబిజెపి 100 స్థానాలు, కాంగ్రెస్ 178స్థానాలు గెలుచుకున్నాయి. జమ్మూలో బిజెపి 43, కాంగ్రెస్ 18 స్థానాలను గెలుచుకుంది. పురపాలక ఎన్నికల్లో విజయం ప్రాంతీయ కుటుంబ పార్టీలైన పి‌డి‌పి,ఎన్‌సి‌పిలతో సంబంధాలు తెంచుకునేందుకు దోహద పడింది . పూర్తి ఐదేళ్ళు ఉన్నందునజమ్మూ కాశ్మీర్ ను అర్థం చేసుకోవడానికి బిజెపి కసరత్తుకు తగినంత కాలం  ఉండింది. ఇక స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులతో సంబంధం పెట్టుకోవడం ప్రారంభించి, రాజకీయ మధ్యవర్తులు లేకుండా నేరుగా వారికి నిధులు పంపించింది.సుదూరంలోని ఢిల్లీని మునుపెన్నడూచూడని వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపింది,అదే సమయంలో ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని కూడా తనకు అనుకూలంగా పునర్నిర్మించుకున్నది.

ప్రపంచం మీద పెరుగుతున్న పట్టుతో, భారతదేశం తన అభిప్రాయాలను ప్రపంచ దేశాలలో గట్టిగా వినిపించి, పాకిస్తాన్ ను ఏకాకిని చేసింది.సర్జికల్ స్ట్రైక్,పుల్వామా దాడికి ప్రతిగా జరిపిన బాలకోట్దాడులు– తన ప్రజలు,భూభాగాన్ని సంరక్షించడానికి భారతదేశం  తీసుకున్న సరైన చర్యలలో భాగం అని  ప్రపంచం అంగీకరించింది. మోడీ అధికారంలోకి రాకముందు,కాంగ్రెస్ పాలనలోఇది ఊహించలేము.

మోడీ ప్రభుత్వం, కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాత్రమే కాకుండా, పాకిస్తాన్ దుష్టప్రవృత్తిగురించి కూడా ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని మార్చింది. భారతదేశభౌగోళిక రాజకీయ స్వరూపం మార్చడానికి అమెరికాను ముందుగానే సముదాయించడానికి ఇది ఉపకరించింది. స్థానిక రాజకీయాల నుండి ప్రాపంచిక రాజకీయాల వరకు ఆర్టికల్ 370 ను తొలగించే ఈ కసరత్తు సాగింది. ఈ భీకర కసరత్తుకు 2019లో లభించిన అఖండ ప్రజా తీర్పు తొడయ్యింది,ప్రతిపక్షాన్ని పూర్తిగా మూలన పడేసిన ఈ తీర్పు తో  మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ చర్య తో బి‌జే‌పి మరియు దాని పూర్వ అవతారమైన జనసంఘ్ పూర్తి మెజారిటీ వస్తే ఏమి చేస్తామని వాగ్దానం చేసిందో  అది మాత్రమే కాక ఈ ఆర్టికల్ ను రూపొందించిన కాంగ్రెస్ మరియు పండిట్ నెహ్రూ ఏమి చేద్దామని ఇంత కాలం చేయలేక పోయారో దాన్ని చేసి చూపింది.

(ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యం తో )