Home News వేలాదిగా పాఠశాలల అభివృద్ధికి ప్రధాని సంకల్పం

వేలాదిగా పాఠశాలల అభివృద్ధికి ప్రధాని సంకల్పం

0
SHARE

ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా పాఠ‌శాల‌ల అభివృద్ధిగా దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కీల‌క ప్రకటన చేశారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన 45 మందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పేరిట ఎంపిక చేసే 14,500 పాఠశాలల్లో నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామన్నారు. కొత్త టెక్నాలజీ, స్మార్ట్ క్లాస్‌రూంలు ఈ పాఠశాలల్లో ఉంటాయన్నారు. ఈ పాఠశాలల ద్వారా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులకు మేలు జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.