
జమ్మూలో రెండురోజుల క్రితం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. గురువారం ఉదయం 5గంటలకు ఒక ట్రక్కులో నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జాతీయ రహదారిని మూసివేశాయి. దాదాపు 5 గంటలపాటు జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఉగ్రవాదులకు చెందిన 11 ఏకే-47 రైఫిళ్లను, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ పేర్కొంది. వీరంతా జైష్-ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వెల్లడించింది. వారు డీడీసీ (డిస్టిక్ డెవలప్మెంట్ కౌన్సిల్) ఎన్నికలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.