పాకిస్తాన్ సహా మరో 11 దేశాల టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యూ.ఏ.ఈ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. కోవిడ్ మరో సారి విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ విదేశాంగ కార్యదర్శి ప్రతినిధి జాహిద్ ఆఫీస్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటికే జారీ చేసిన వీసాలపై ఈ నిబంధన వర్తించదని విదేశాంగ కార్యాలయం తెలిపింది. యూఏఈ ప్రభుత్వం తాజా వీసా ఆదేశాలతో దెబ్బతిన్న దేశాల్లో పాకిస్తాన్ టర్కీ, ఇరాన్, యెమెన్, సిరియా, ఇరాక్, సోమాలియా, లిబియా, కెన్యా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.
Source : Economic Times