Home News వర్ధన్నపేట పోచమ్మ ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించిన ఎం పి టి సి అన్వర్

వర్ధన్నపేట పోచమ్మ ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించిన ఎం పి టి సి అన్వర్

0
SHARE

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని లోని పోచమ్మ తల్లి దేవాలయంలో గ్రామస్తులు ఈ నెల 12 నాడు బోనాలు సమర్పించారు. ఇందులో గ్రామస్తుల తో సహా వివిధ పార్టీల  ప్రతినిధులు పాల్గొన్నారు.  అందరు భక్తీ శ్రద్ధలతో ఆలయ ఆచారాలకు అనుగుణంగా పాద రక్షలు గుడి ప్రాంగణం వెలుపలే వదిలి వచ్చారు. కాని ఆలయానికి విచ్చేసిన అధికార తెరాస పార్టీ ఎం పి టి సి సభ్యుడు ఎం డి అన్వర్ మాత్రం పాదరక్షల తోనే  ఆలయ ప్రాంగణం లో ప్రవేశించాడు. ఇది గమనించిన అక్కడి స్థానిక భక్తులు అతడికి చెప్పులతో ప్రవేశించరాదని సూచించారు. భక్తుల మనోభావాలు ఏ మాత్రం పట్టించుకోకుండా అట్లే ఆలయ ప్రాంగణం లో నిలుచున్నాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్నీ స్థానికులు కొంత మంది సోషల్ మీడియా లో బహిర్గతపరచగా, ఎంపిటిసి సభ్యుడు ఎం డి అన్వర్ అతనికి ఫోన్ చేసి ఈ ఫోటోలను వెంటనే ను తొలగించాలని, లేని పక్షం లో పోలీసు కేసులు పెట్టుతామని బెదిరిస్తున్నాడు.

ఈ సంఘటన పై గ్రామస్తులు స్పందిస్తూ ఇలాంటి చర్యల వలన హిందువుల మనోభావాలు గాయపడుతాయని ఆవేదన వ్యక్తం చేసారు.