Home News యూపీలో మదర్సాల సర్వేను స్వాగతించిన ముస్లిం రాష్ట్రీయ మంచ్

యూపీలో మదర్సాల సర్వేను స్వాగతించిన ముస్లిం రాష్ట్రీయ మంచ్

0
SHARE

ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల సర్వే చేపట్టే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముస్లిం రాష్ట్రీయ మంచ్ స్వాగతించింది. మదర్సాల సర్వే చేపట్టడంతో ఎలాంటి హాని వాటిల్లదని మంచ్ పేర్కొంది. అదే సందర్భంలో క్రైస్తవులు, బుద్ధిస్ట్, ఆర్య సమాజ్, తదితర ధార్మిక సామాజిక వర్గాలు నిర్వహించే విద్యా సంస్థల్లోనూ ఇదే తరహా సర్వే చేపట్టాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ సభ్యులు మహ్మద్ అఫ్జల్, డాక్టర్ షాహిద్ అఖ్తర్, ఇస్లామ్ అబ్బాస్, రజా రిజ్వీ, మజీద్ కలాకోట్, అబుబాకర్ నఖ్వీ, రేష్మా హుస్సేన్, ఇర్ఫాన్ పీర్జాదా, సిరాజ్ ఖురేషీ, షాలిని అలీ గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దేశపు ప్రధాన జనజీవన సవ్రంతిలో కలిసిపోయి, ముదుకు సాగడానికి ముస్లింలకు ఇదే సరైన సమయమని వారు అన్నారు. మదర్సాల్లో విద్యార్థులకు సాంకేతిక, వృత్తిపరమైన, నైపుణ్య శిక్షణ సైతం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో బోధనా ప్రణాళిక, బోధనా శైలిని తెలుసుకోవడానికి సర్వే చేపట్టడం అవసరమని ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎడ్యుకేషన్ బోర్డు విధించిన నియమావళిని అనుసరించకుండా, రిజిస్టరు కాని మదర్సాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వారు తెలిపారు.

మదర్సాల్లో చదివే విద్యార్థులకు నాణ్యతతో కూడుకున్న అధునాతన విద్యను అందించాలని మంచ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యార్థులు దేశపు ప్రధాన జనజీవన స్రవంతిలో చేరగలరని, జీవితంలో పురోగమిస్తారని వారు అన్నారు.

నాన్ రికగ్నైజ్డ్, అన్ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థల్లో ఒక సర్వేను అక్టోబర్ 25నాటికి చేపట్టాలని మదర్సా బోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా సదరు మదర్సాల మేనేజ్‌మెంట్, నిధులు అందుతున్న వైనాన్ని కనుగొనడానికి ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్టు సర్వే చేపట్టనుంది. మదర్సా బోర్టు ఛైర్మన్ ఇఫ్కెఖార్ అహ్మద్ జావెద్ ప్రకారం ఈ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న తీరు, ఆ సంస్థలకు నిధులు ఎలా వస్తున్నదీ సర్వే శోధిస్తుంది. ఒక వేళ ప్రైవేట్ మార్గంలో నిధులు అందుతున్న పక్షంలో నిధులు అందిస్తున్న వారి వివరాలు, నిధులు ఏ రూపేణా అందుతున్నదీ సర్వే కనుగొంటుందని వారు తెలిపారు. మదర్సాల సర్వే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహదుల్ ముస్లిమిన్(AIMIM) తో పాటుగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

Source : Sirf News