Home News ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి : షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

ముస్లిములు తమ పూర్వీకులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి : షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్

0
SHARE

వివాదాస్పదమైన అన్ని స్థలాలలో ముస్లింలు తమ వాదనలను ఆపి, కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన 11 మసీదులను హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్, షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీమ్ రజ్వి అన్నారు.

ముస్లింలు మధుర, వారణాసి, జౌన్‌పూర్‌లతో సహా దేశవ్యాప్తంగా ఇలాంటి 11 వివాదాస్పద స్థలాల విషయంలో తమ వాదనను ఆపివేసి, తమ పూర్వీకుల తప్పులను సరిదిద్దుకోవడానికి ఆ స్థలాలను హిందువులకు అప్పగించాలని రిజ్వి విజ్ఞప్తి చేశారు. అయితే కూల్చివేసిన దేవాలయాలపై నిర్మించిన వివాదాస్పద నిర్మాణాలలో నమాజ్ చేయడానికి సున్నీ ముస్లింలు అనుమతి కోరిన నేపధ్యంలో ఆయన  ఈ విజ్ఞప్తి  చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రచురించింది.

ఇలాంటి  పరిష్కారమార్గాన్ని అనుసరించకపోతే  అయోధ్య వివాదం తేలిన తర్వాత కూడా ఇలాంటి మరిన్ని వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.  వివాదాస్పద నిర్మాణాలలో నమాజ్ చేయడానికి సున్నీలు అనుమతి కోరిన తరువాత అటువంటి విజ్ఞప్తి అవసరం” అని ఆయన  అన్నారు.

`మసీదులను నిర్మించడానికి మొఘలులు తీసుకున్న దేవాలయాల భూమిని తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని, దేవాలయాల స్థానంలో నిర్మించిన మసీదులను హిందువులకు అప్పగించాలని, పూర్వీకుల తప్పులను మనం సరిదిద్దుకుని దేశంలో శాంతిని నెలకొల్పాలి’ అని రిజ్వి చెప్పారు