Home News తెలంగాణా లో 9 లేదా 12శాతం ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్‌ కమిషన్‌ సిఫారసులు, ప్రజాభిప్రాయ సేకరణకు...

తెలంగాణా లో 9 లేదా 12శాతం ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్‌ కమిషన్‌ సిఫారసులు, ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌

0
SHARE

ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్‌

*    14 -17 మధ్య బహిరంగ విచారణ.. 19 వరకూ అభిప్రాయాలకు అవకాశం,  *   తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్.. ముస్లింలూ రిజర్వేషన్లకు అర్హులే

*   9 లేదా 12శాతం అమలు చేయాలి.. న్యాయ సలహా తీసుకుని చట్టం చేయాలి *   సబ్‌ ప్లాన్‌, స్టార్టప్‌ ఫండ్‌లు ఉండాలి.. నివేదికలో సుధీర్‌ కమిషన్‌ సిఫారసులు

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అడుగు ముందుకు పడింది. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలంగాణ బీసీ కమిషన నిర్ణయించింది. ఈ మేరకు బీసీ కమిషన కార్యదర్శి జీడీ అరుణ శనివారం నోటిఫికేషన విడుదల చేశారు. ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిన సుధీర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నోటిఫికేషన జారీ చేశారు. ఖైరతాబాద్‌లోని వాటర్‌ బోర్డు కార్యాలయం వెనుక గల భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న కమిషన కార్యాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల దాకా బహిరంగ విచారణ జరగనుంది. ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లపై అభిప్రాయాలను తెలపవచ్చు. ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా లిఖితపూర్వకంగా అభిప్రాయాలు/ విజ్ఙాపనలు అందించవచ్చని కమిషన్‌ సూచించింది.

‘దేశవ్యాప్తంగా, తెలంగాణవ్యాప్తంగా సేకరించిన సమాచారం ప్రకారం ముస్లింలు రిజర్వేషనకు అర్హులే. రాజ్యాంగంలో నిర్వచించిన అంశాల ప్రకారం, ముస్లింలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీరి పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. రిజర్వేషన్లు కావాలని అడిగే హక్కు ఇతర కులాలకు ఉన్నట్లే ముస్లింలకూ ఉంది’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జి.సుధీర్‌ నేతృత్వంలోని కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలో భాగంగా ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా వారి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులపై అధ్యయనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జి.సుధీర్‌ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అధ్యయనానికి 9 అంశాలను పరిశీలనకు తీసుకుంది. ఈ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ముస్లింలలో 82 శాతం వెనకబడి ఉన్నారని, వారికి కనీసం 9 లేదా 12 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని సూచించింది. వారికి 4 శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తూనే న్యాయపరమైన సలహా తీసుకొని చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఉద్యోగుల శాతాన్ని పెంచాలని, అక్షరాస్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాన అవకాశాలు కల్పించడానికి కమిషన ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ముస్లింలకు సబ్‌ ప్లాన ఏర్పాటు చేసి, చిన్నపాటి వ్యాపారాల కోసం స్టార్టప్‌ ఫండ్‌ పెట్టాలని, ఉపకార వేతనాలను పెంచాలని సూచించింది. ‘‘ముస్లింలకు పోలీసు, భద్రతా వ్యవస్థలపై అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇకముందు కొనసాగించాలి. ముస్లిం యువకులను టెర్రరిస్టులు, నేరస్థులు అనే అనుమానంతో విచక్షణరహితంగా అరెస్ట్‌ చేయడం ఆపేయాలి. ప్రధానంగా హైదరాబాద్‌లో మతసామరస్యం పెంపొందించాలి’’ అని నివేదించింది. రాష్ట్రంలో మదర్సా బోర్డును స్థాపించి, అన్ని మదర్సాలు అందులో చేరేలా చూడాలని, మదర్సా కోర్సులకు రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా హోదా ఇవ్వాలని, వాటిలోని విద్యార్థులకు రెగ్యులర్‌ కోర్సుల్లో చేరేలా ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. ఈ నివేదికను ప్రభుత్వం.. శనివారంtelangana.gov.in, tsbcwd.cgg.gov.in, coiformuslims.telangana.gov.in వెబ్‌సైట్‌లలో ఉంచింది. విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు, ఆక్షేపణలను [email protected] అనే ఈమెయిల్‌ చిరునామాకు పంపించాలని విజ్ఞప్తి చేసింది.

సుధీర్‌ కమిషన్‌ సిఫారసులు ఇవే..

*   రిక్రూట్‌మెంట్లు, ట్రైనర్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సమానావకాశాల కమిషనను నియమించడంలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిది కావాలి. ప్రైవేటు, పబ్లిక్‌ రంగాలతో సహా అన్ని క్షేత్రాల్లో అన్ని కమ్యూనిటీలకు సమాన అవకాశాలు లభించేలా కమిషన చూడాలి.

 *   సెట్విన్ ను అన్ని జిల్లాలకు విస్తరించాలి. టీఎ్‌సఐఐసీ ద్వారా 12శాతం పారిశ్రామిక ప్రాంతాలను ముస్లిం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించాలి. గృహ నిర్మాణాల్లో పట్టణాల్లో 12శాతం, గ్రామాల్లో 7శాతం ఇళ్లను ముస్లింలకు కేటాయించాలి.

  *   స్టేట్‌ సర్వీసుల నుంచి ముస్లింలకు పదోన్నతులు కల్పించి అఖిల భారత సర్వీసుల్లో వారి సంఖ్యను పెంచాలి. పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పించి 33శాతం ముస్లిం మహిళలకు అవకాశం ఇవ్వాలి.

 * జూ మండల స్థాయిలో మైనారిటీ సంక్షేమ శాఖను, డివిజన, రాష్ట్ర స్థాయిలో మైనారిటీ సంక్షేమ అధికారులను నియమించాలి. ఓన యువర్‌ ఆటో వంటి పథకాలు రాష్ట్రవ్యాప్తంగా పెంచాలి. మైనారిటీ గురుకులాల సంఖ్యను పెంచాలి.

 *   వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనను ఏర్పాటు చేయాలి.

 *    బడికి అసలే వెళ్లని 0-29 ఏళ్ల వయసు వారు ముస్లింలలో 13శాతం, హిందువుల్లో 17శాతం ఉన్నారు. ఏ విద్యా సంస్థకూ వెళ్లని 16-20 ఏజ్‌ గ్రూపు వారు హిందువుల్లోని అన్ని వర్గాల వారు కలిపితే 34.8శాతం, ముస్లింలలో 51.5శాతం.

 *    ప్రస్తుతం బడికి వెళ్లని 21-25 ఏజ్‌ గ్రూపు వారు ముస్లింలలో 81.4శాతం, హిందువుల్లో 74.8శాతం ఉంది. ముస్లిం విద్యార్థుల స్కూల్‌ ఎనరోల్‌మెంట్‌ 11.5శాతం (బాలురు 11.2శాతం, బాలికలు 12.4శాతం). ఇంటర్మీడియట్‌ ఎనరోల్‌మెంట్లలో 5శాతం తగ్గుదల ఉంది. (బాలురు 5.3శాతం, బాలికలు 4.8శాతం).

*     బ్యాచిలర్‌, డిగ్రీ, మాస్టర్స్‌ ప్రోగ్రాముల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో ముస్లింల ఎనరోల్‌మెంట్‌ బహుస్యల్పం. ఓయూ స్థాయిలో ముస్లిం విద్యార్థులు 10.85శాతం మాత్రమే. వృత్తివిద్యా కోర్సుల్లోనూ ముస్లింల శాతం తక్కువే.

*   ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి. ఆంగ్లం ఒక పేపర్‌గా చదివే అవకాశం కల్పించాలి.

*  2005-06ల్లో ఆంధ్రప్రదేశలోని ఇతర ఎస్సార్సీలతో పోల్చితే ముస్లింల శిశు మరణాల రేటు తక్కువగానే (52.2/1000)ఉంది. రాష్ట్ర సగటు రేటు (68.4/1000).

*     6-59 నెలల ముస్లిం మగ శిశువుల్లో తీవ్ర అనీమియా వ్యాధిగ్రస్థులు తక్కువే(9.4ు). హిందువులది (13.6శాతం). అయితే బాలికలకు సంబంధించి ఇది భిన్నంగా ఉంది. (హిందూ బాలికలు 14.1శాతం, ముస్లిం బాలికలు 15.2శాతం).

*    6-59 నెలల పిల్లల్లో అనీమియా వ్యాధితో బాధపడుతున్న ముస్లిం బాలికలు 72శాతం, బాలురు 68శాతం. హిందువుల్లో బాలురది 71.4శాతం, బాలికలది 70శాతం.

*     6-59 నెలల పిల్లల్లో తీవ్ర, మామూలు అనీమియా వ్యాధులతో బాధపడేవారు హిందువుల్లో కంటే ముస్లింలలో ఎక్కువ.

*     2012-13 డీఎల్‌హెచఎ్‌స-4 సర్వే ప్రకారం పిల్లల్లో బక్క పలుచదనం(ఎత్తుకు తగ్గ బరువు లెక్కల్లో) గ్రామీణ తెలంగాణలో (32శాతం) కంటే పట్టణ తెలంగాణలో తక్కువ (27శాతం). 5 ఏళ్లలోపు ముస్లిం పిల్లల్లో బక్కపలుచదనం ప్రాబల్యం 24శాతం. ఎస్సీ పిల్లల్లో 27శాతం. ఎస్టీ పిల్లల్లో 30శాతం రిపోర్టులు తెలుపుతున్నాయి.

*    జూ ఎదుగుదల లోపం ముస్లిం పిల్లల్లో తక్కువగా (21శాతం) కనబడుతోంది. 5 ఏళ్లలోపు బరువు తక్కువ ఉన్న పిల్లలు రాష్ట్ర స్థాయిలో 30శాతం ఉన్నారు. ముస్లింల పిల్లల్లో 28శాతం ఉన్నారు. ఇంటి వద్ద ప్రసవాలు ముస్లింలలో తక్కువ(3.9). హిందువుల్లో 5.5శాతం. అన్ని రకాలుగా వ్యాక్సినేషన పొందిన పిల్లల శాతం 2007-08లో తెలంగాణలో సగటున 72.2శాతం. 2012-13లో 47.5శాతం, 2015-16లో 69.1శాతానికి తగ్గిపోయింది.

*     2012-13 బీహెచఎల్‌ఎ్‌స సర్వే ప్రకారం ముస్లిం పిల్లల్లో బీసీజీ వ్యాక్సిన తీసుకున్న వారు 93శాతం. గ్రామీణ తెలంగాణలో 79శాతం హిందువుల ఇళ్లలో టాయిలెట్‌ సౌకర్యం ఉండగా, ముస్లిం, బీసీల్లో ఆ సౌకర్యం ఉన్నవారు 63శాతం మాత్రమే.

*    ముస్లింల పని భాగస్వామ్యం (డబ్ల్యూపీఆర్‌) రేటు ప్రకారం గ్రామాల్లో పురుషులు 74.8శాతం, సీ్త్రలు 46.5శాతం. పట్టణాల్లో పురుషులు 68.7శాతం, స్ర్తీలు 8.2శాతం. ఇతర ఎస్సార్సీలతో పోలిస్తే ఇది తక్కువ.

*    ముస్లింలలో ఎక్కువ మంది వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లో, స్వయం ఉపాధిలో స్ధిరపడ్డారు. ముస్లింలలో క్యాజువల్‌ లేబర్‌ కూడా ముఖ్యమైన వ్యాపకం. 32శాతం ముస్లిం కార్మికులు ఈ క్యాటగిరీకి చెందుతారు.

*    ముస్లింలలో శ్రమ జీవులు వ్యవసాయేతర రంగం వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే తెలుపుతోంది. 76శాతం శ్రమ జీవులు సర్వీస్‌ సెక్టార్‌లో ఉన్నారు.

*    రాష్ట్రంలోని ముస్లింలకు ప్రధాన ఆదాయ వనరు దిన కూలీ. 50శాతం ముస్లింల కుటుంబాల నెలసరి ఆదాయం పదివేల లోపే ఉంది.

 *    ముస్లిం కమ్యూనిటీలో సొంత ఆస్తులు ఉన్న వారు తక్కువే. సర్వే ప్రకారం ముస్లింలలో వలస వెళ్లేవారి సంఖ్య ఎక్కువ.

 *   తెలంగాణలో బ్యాంకులకు, క్రెడిట్‌, కేంద్రాలకు వెళ్లే ముస్లింల సంఖ్య తక్కువ.

*     మేథర్‌ వంటి ముస్లింల కమ్యూనిటీలను ఎస్సీ జాబితాలో చేర్చాలి.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)