Home News వడ్ల పంచాయతీ… అస‌లు వాస్త‌వాలు

వడ్ల పంచాయతీ… అస‌లు వాస్త‌వాలు

0
SHARE

-తాల్లోజు న‌ర్సింహాచారి

కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్లు కొన‌డం లేద‌ని తెలంగాణ రాష్ట్రంలో నిర‌స‌న‌లు చేస్తున్నారు. అయితే నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్లు కొన‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణాలు ఏమిటి వాస్త‌వ‌లను తెలుసుకుందాం.

మొదట కేంద్రం కొనేది వడ్లు కాదు బియ్యం అనేది గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు సేకరించి బియ్యం పట్టించి కేంద్రానికి ఇవ్వాలి, అప్పుడు కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది. ఆ త‌ర్వాత ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అంద‌జేయాలి. ఇది జరగాల్సిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ.

అయితే వడ్ల నుండి నేరుగా బియ్యం తీస్తే వాటిని Raw Rice అంటారు. (పంట చేతికి రాగానే మనం ఇంటి దగ్గర గిండ్రి లో పట్టించుకున్నట్లు) ఇందులో నూకల శాతం ఎక్కువ, అన్నం కూడా మెత్తగా అవుతుంది.

వడ్లను మిషన్ లో త్వరగా ఆరబెట్టి బియ్యం చేస్తే Streaming Rice అంటారు (బియ్యం దుకాణాలలో Packing చేసి అమ్మే బియ్యం మనం ఫంక్షన్స్ లో వాడే బియ్యం) ఈ బియ్యంలో నూకల శాతం తక్కువ బియ్యం చాలా బాగా ఉంటాయి.

వడ్లను ఉడకబెట్టి బియ్యం చేస్తే వాటిని Boil Rice అంటారు (ఇవ్వి పూర్వం తినే వారు గోధుమ రంగులోకి మారీ గట్టిగా తయారవుతాయి) ఇందులో నూకల శాతం అనేది ఉండదు.

రైతులు తినేది Raw Rice, ఫంక్షన్ లలో , దేశ విదేశాలకు Export చేసేది Streaming Rice. కాబ‌ట్టి ఇప్పుడు Boil Rice విషయానికి వస్తే పూర్వం చాలా తినేవారు, ఇప్పుడు చాలా తక్కువ అయింది. విదేశాలలో కూడా డిమాండ్ లేదు. మనదేశంలో కూడా చాలా అంటే చాలా తక్కువగా తింటున్నారు.

ఇప్పుడు కేంద్రం చెబుతున్న‌ది ఏంటంటే… BOIL RICE కాకుండా STREEMING RICE పంపించండి అని రాష్ట్రానికి కేంద్రానికి లేఖ ద్వారా తెలిపింది. ఇక్కడ ఉంది అసలు తిరకాసు, కేంద్రం రైతుల గురించి కానీ వారు పండించే పంట గురించి కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు

రైతుల నుండి వడ్లు సేకరించి బియ్యం పట్టి మాకు పంపండి. కానీ దేశీయ అంతర్జాతీయ మార్కెట్ లో BOIL RICE కి డిమాండ్‌ లేదు కాబట్టి BOIL RICE వద్దు అని చెబుతున్న‌ది.

BOIL RICE లో తరుగు నూకల శాతం ఉండదు కావున STREEMING RICE కంటే ఎక్కువ మొత్తం వడ్ల నుండి డెలివరీ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు అదనంగా లాభం వస్తుంది.
ఉన్నట్టుండి కేంద్రం BOIL RICE వద్దు అనేసరికి ఇటు ప్రభుత్వానికి, మిల్లర్లకు ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోక వారి సమస్యను రైతులకు అంటగట్టి కేంద్రం వడ్లు కొనడం లేద‌ని నిందలు వేసి కేంద్ర ప్రభుత్వం ను బద్నాం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు STREEMING RICE పంపిస్తే ఎవరికి స‌మ‌స్య ఉండదు. కానీ వీళ్లకు లాభం ఉండదు కాబ‌ట్టి, అందుక‌ని BOIL RICE కొనమని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

BOIL RICE నిల్వలు ఇప్పటికే కేంద్రం దగ్గర చాలా ఉన్నాయి. ప్రజలు BOIL RICE కంటే STREEMING RICE కే అలవాటు పడ్డారు. కాబట్టి ఇక మీద BOIL RICE వద్దు అనేది కేంద్రం వాదన.

పంజాబ్ లోనీ రైతులు వానాకాలం వడ్లు పండిస్తారు. ఎండాకాలం గోధుమ పంట వేస్తారు.
అందుకే వానాకాలం ఎంత పండిన 100% పంట సేకరించి స్ట్రీమింగ్ రైస్ చేసి కేంద్రానికి పంపిస్తారు.

మన రాష్ట్రంలో యాసంగిలో వరి వేస్తం కాబట్టి BOIL RICE వద్దంటోంది కేంద్రం. కాబట్టి STREEMING RICE చేస్తే నూకల శాతం ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం, మిల్లర్లకు తక్కువ లాభాలు వస్తాయి దెబ్బ పడుతుంది. కాబట్టి వారి స్వంత సమస్యను రైతులపై రుద్దాలని చూస్తున్నారు.

యాసంగి పంట మార్పిడి చేపట్టాలంటే రైతుకు అవగాహన కల్పించాలి మద్దతు ధర ముందే ప్రకటించాలి తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ పరీక్షలు నిర్వహించాలి వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ చెయ్యాల్సి ఉంటుంది. ఇదే మాట కేంద్రం కూడా చెప్పుకొచ్చింది.