Home News వ‌న‌వాసి గ‌ర్భిణుల‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో సీమంతం చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

వ‌న‌వాసి గ‌ర్భిణుల‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో సీమంతం చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

0
SHARE

వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలంలోని వ‌న‌వాసీ గర్భిణుల‌కు సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో సీమంతం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. శ్రీ రాముడి పట్టాభిషేకం నాడు భద్రాచలంలో శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్య రాజన్ గారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ‌ర్భిణుల‌కు సీమంతం కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ మోకాళ్ళ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించిన వారి గురించి తెలిపారు. జిల్లా మహిళా ప్రముఖులు శ్రీమతి పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ కళ్యాణ ఆశ్రమం ప్రారంభం చేస్తున్న పనుల గురించి వివరించారు. ప్రాంత కార్యకారిణి శ్రీమతి బందా స్వరూపరాణి జాతీయ గీతాలాపన చేసి నివేదిక తెలిజేశారు. ఎస్.ఎస్.ఎన్ చైర్మన్ శ్రీ కోకిల మంజూరు శ్రీ సభను ఉద్దేశించి మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు గల 16 రకాల సంస్కారాలను తెలియపరుస్తూ హైందవ ధర్మ గొప్పతనాన్ని ఈ సందర్భంగా నొక్కివక్కాణించారు. జగదభిరాముడు అయిన శ్రీ రాముడు పట్టాభిషేకం రోజున గిరిజన మహిళలకు సీమంతం కార్యక్రమం చేయడం రాముని లీలగా అభివర్ణించారు.

అనంత‌రం గవర్నర్ మాట్లాడుతూ పూర్తి ఏజెన్సీ గ్రామల నుంచి ఇక్కడకు విచ్చేసిన గిరిజన గర్భిణీ స్త్రీలందరికీ వారి ఆశీస్సులు తెలియజేస్తూ చీర, జాకెట్, పూలు, పళ్ళు, స్వీటు స్వయంగా వారి చేతుల మీదగా అందించారు. వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ వారు ఇటువంటి గొప్పకార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు. దుమ్ముగూడెం మండల మహిళా కార్యదర్శి మడకం భారతి మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి శ్రీ సుదీర్ జి, ప్రాంత సహా కార్యదర్శి శ్రీ షామీర్ శ్రీనివాస రావు, సేవా భారతి నుండి మునీశ్వర్ గారు, ఆవుల సుబ్బారావు గారు, జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీ కోరం సూర్యనారాయణ గారు, ప్రఖండ ప్రముఖ సున్నం. రాజేష్ దుమ్ముగూడెం మండలం ముర్రం లక్ష్మీనర్స్ లను వనవాసి కళ్యాణ పరిషత్ వారు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఉపాధ్యక్షులు గోనె. లక్ష్మీనారాయణ గారు, జిల్లా కోశాధికారి డాక్టర్ అర్థం. కృష్ణయ్య గారు 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.