Home News శాంతసామరస్యాలు కేవలం ఒక వర్గపు బాధ్యత కాదు – పెజావర్ పీఠాధిపతి

శాంతసామరస్యాలు కేవలం ఒక వర్గపు బాధ్యత కాదు – పెజావర్ పీఠాధిపతి

0
SHARE

ఉడిపిలోని హిందూ దేవాలయాల వార్షిక జాతరల స‌మ‌యంలో దేవాల‌య ప‌రిస‌ర ప్రాంతాల‌లో వ్యాపారాలు చేయ‌డానికి బహిష్కర‌ణ‌కు గురైన ముస్లిం వ్యాపారులు బుధ‌వారం మార్చి 30న పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసి గతంలో వలె జాతరలో త‌మ‌ వ్యాపారాల‌కు అనుమతించాలని అభ్యర్థించారు.

ఈ విష‌యంపై శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ స్పందిస్తూ “ఒక సమాజానికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటే శాంతి, సామరస్య‌త చాలా అవసరం. ఈ శాంతి ఒక సమాజానికి భారం కాకూడ‌దని, కేవలం ఒక సమాజం వల్ల శాంతిని సాధించలేము” అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

“హిందువుల‌మైన మేము చాలా కాలంగా బాధను అనుభవించాము. అనేక చేదు అనుభవాల కారణంగా హిందూ సమాజం వేదనలో కూరుకుపోతోంది. కొంతమంది మత పెద్దల మధ్య పరస్పర చర్చలతో ఈ సమస్యను పరిష్కరించలేము. అట్టడుగు స్థాయిలో శాశ్వత పరిష్కారం కోసం ప్ర‌య‌త్నించాలి. స‌మాజంలో ఒక వ‌ర్గం లేదా సమూహం నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు అది నిరాశ‌, కోపం, ఆవేద‌న‌కు దారితీస్తుంది. అలాంటి ఎన్నో అన్యాయాల‌తో హిందూ సమాజం విసిగిపోయింది. కాబ‌ట్టి ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్క‌రానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఈ పరిస్థితికి గ‌ల కారణాలను వెతికి వాటిపై చర్చించాలి. హిందూ సమాజం నిరంతరం హింసకు గురికాకుంటే మళ్లీ సామరస్య‌త నెలకొంటుంది” అని తెలిపారు.

ఇటీవ‌ల ఒక హిందూ వితంతువు చెందిన పశువుల కొట్టంలోని ఆవుల‌ను “మీ వ‌ర్గానికి” చెందిన కొంద‌రు వ్య‌క్తులు దొంగలించారు. దీంతో ఆమె జీవనోపాధి చిన్నాభిన్నమైంది. ఆమె కుటుంబం వీధిన ప‌డింది. ఇటువంటి మరెన్నో క్రూరమైన సంఘటనల‌తో హిందువులు ఆవేద‌న చెందారు.

మీరు చేసిన హిజాబ్ పోరాటం ఫలితంగా మాత్రమే ముస్లిం వ్యాపారుల ఆర్థిక బహిష్కరణ జరిగిందని భావించకండి. హిందూ సమాజం పరమపావన స్థానాలుగా భావించే మఠాలు..దేవాలయాల దగ్గర మీరు హిజాబ్ కు అనుకూలంగా మీరు చేసే వ్యాపారాలు మూసివేశారు. ఈ చ‌ర్య వ‌ల్ల హిందూ సమాజం మరింతగా ఆగ్ర‌హానికి గురైంది. దీనివలన మీకు జరిగిన నష్టంతో పోలిస్తే హిందూ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులే ఎక్కువ. ఒక ధర్మనిష్ట కలిగిన హిందూ కార్యకర్తను కూడా హిందూ సమాజం కోల్పోయింది.

మీరు ఏదైతే సమస్యను ఎదుర్కుంటున్నాము అని భావిస్తున్నారో ఆ సమస్య మూల కారణాన్ని వెతికి దాన్ని పరిష్కరించాలని నేను భావిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం పైకి నటిస్తూ చెప్పే మాటలతో ‘శాంతిని సాధించలేము, అలాగే సహజీవనం కూడా సాధ్యం కాదు. మీరు మనఃస్పూర్తిగా నోటితో చెప్పేది చేతలలో చూపిస్తే మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదు.

“మీ సమాజంలో తప్పు చేసిన వారిని శిక్షించనివ్వండి, ఇతరులకు చేసిన తప్పులను పరిష్కరించండి అలాగే తప్పు చేసిన సభ్యులపై నిరసన తెలియజేయండి. ఒకరు చేసే తప్పుడు పనులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. తప్పు చేసేవారిని మీ స‌మాజం ప్ర‌శ్నిస్తే హిందూ సమాజం ఇంత బాధను అనుభవించదు. కాబ‌ట్టి ముందుగా మీరు మీ సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకొని సమస్యను పరిష్కరించుకోవాల‌ని స్వామీజీ వారికి స్ప‌ష్టం చేశారు.