Home News రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి కాగ్ క్లీన్ చిట్

రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి కాగ్ క్లీన్ చిట్

0
SHARE

ఫ్రాన్సుకు చెందిన యుద్ధ రాఫెల్ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న  ఒప్పందంలో అవినీతి జరిగిందన్న వాదనకు కంప్ట్రోలర్ & ఆడిటర్ జెనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెరదించింది. ఈ అంశంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ చేస్తున్న నిరాధార ఆరోపణలను కొట్టి పారేసిన కాగ్, కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆరోపణల్లో నిజంలేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చిచెప్పింది.

కాగ్ సమర్పించిన నివేదిక ప్రకారం.. 2007వ సంవత్సరంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాఫెల్ తో చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం 2.86 శాతం తక్కువ ధరకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందానికి సంబంధించి 11 కీలక అంశాలను కాగ్ ప్రామాణికంగా తీసుకుంది.  కాగ్ నివేదికను కేంద్ర ఆర్ధిక శాఖ సహాయక మంత్రి పి. రాధాకృష్ణన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

ఈ నివేదికలో ప్రాతిపదికగా తీసుకున్న 11 అంశాల్లో.. ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ విమానంతో పాటు అందులోని ఆపరేషనల్ పరికరాలు, విమానానికి అవసరమయ్యే సాంకేతిక సహాయం, ఇందుకోసం పనితీరు మొదలైన టెక్నీకల్ అంశాలపై డాక్యుమెంటేషన్ అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. వీటితో పాటుగా భారత భౌగోళిక అవసరాలకు అనుగుణంగా ఎయిర్ క్రాఫ్ట్ని తీర్చిదిద్దడం, తయారీలో నాణ్యత, సాంకేతిక పనిముట్లు, నైపుణ్యత కలిగిన విడి పరికరాల సరఫరాతో పాటు ఆయుధాల కిట్ మరియు పైలట్లకు కావాల్సిన శిక్షణ అంశాలను కాగ్ బేరీజు వేసింది.

తన నివేదికలో భాగంగా రాఫెల్ ఒప్పందం గురించి పేజీ నెంబర్ 126 నుండి 141 పేజీల్లో పేర్కొన్న కాగ్, పేజీ నెంబర్ పేజీ నెంబర్ 137లో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు, రాఫెల్ తో జరిపిన ఒప్పందంలోని ధరల వ్యత్యాసపు శాతాన్ని వివరించింది.

అదేవిధంగా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో దాసో సంస్థ అత్యల్ప ధర కోట్‌ చేసిన బిడ్డర్‌ కానందున, అదే సమయంలో యూరోపియన్‌ ఏరోనాటిక్స్‌ డిఫెన్స్‌ స్పేస్‌ కంపెనీ కూడా టెండర్‌ అర్హతలను పూర్తిగా చేరుకోనందున 2015 మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సంప్రదింపుల బృందం 126 విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని సూచించినట్టు  కాగ్‌ వెల్లడించింది.