Home News భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం: మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ

భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం: మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ

0
SHARE

భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ మాన‌నీయ‌ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ర‌క్షాబంధ‌న్‌ పర్వదినం విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తుందని, జాతి, కుల, మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగం కావాలని అనేకమంది పోరాట యోధుల త్యాగంతో సిద్ధించుకున్న స్వాతంత్రం 75 వసంతాలు పూర్తై నేడు మనమందరం ఆజాదిక అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగిస్తూనే భారత్ ను విశ్వ గురువుగా నిలబెట్టడానికి ఈ రక్షాబంధనంలో మనమందరం సంకల్పం తీసుకోవాలనీ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విమల్ జైన్ (ప్రముఖ సామాజికవేత్త), మాననీయ సంభాగ్ సంఘచాలకులు శ్రీ డాక్టర్ గంజం కృష్ణప్రసాద్, నగర సంఘచాలక్ శ్రీ యగ్నేశ్వర్ గారు , తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ గారు, హిందూ బంధువులు పాల్గొన్నారు.