Home News ఆరెస్సెస్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేరళ మంత్రికి నోటీసులు

ఆరెస్సెస్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేరళ మంత్రికి నోటీసులు

0
SHARE
కేరళ ఆర్ధిక మంత్రి పరువునష్టం కేసు వేసేందుకు ఆరెస్సెస్ సిద్ధమైంది. కేరళ ఎన్నిలక ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.ఎం. థామస్ ఇస్సాక్ ఆరెస్సెస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొల్లామ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇస్సాక్ ఆరెస్సెస్ గాంధీని హత్య చేసిందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కొల్లామ్ మహానగర సంఘచాలక్ ఆర్. గోపాలకృష్ణన్ మంత్రికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇదే సందర్భంగా మంత్రి థామస్ వ్యాఖ్యలను యధావిధిగా ప్రచురించిన ‘దేశాభిమాని’ పత్రిక సంపాదకుడు పి. రాజీవ్ కి కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు.
అలాగే మంత్రి థామస్ చేసిన వ్యాఖ్యలపై గోపాకృష్ణన్ జిల్లా ఎన్నిలక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా సమర్పించారు. గాంధీ హత్యతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి ఎటువంటి సంబంధం లేదన్న విషయాన్ని అనేక సందర్భాల్లో కోర్టులు, ప్రభుత్వం నియమించిన కమిషన్లు స్పష్టం చేశాయని, సంబంధిత కేసు తీర్పులు, రిపోర్టులు అందరికీ తెలిసేవిధంగా అందుబాటులో ఉన్న విషయాన్ని గోపాలకృష్ణన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖలు చేసిన మంత్రి థామస్ తన తప్పుకు క్షమాపణ చెప్పి తప్పించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఆర్ధిక మంత్రి థామస్ మరియు పత్రిక సంపాదకుడు పి.రాజీవ్ 7 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే వారిపై క్రిమినల్ పరువునష్టం దావా వేయాల్సి ఉంటుందని ఆర్.గోపాలకృష్ణన్ తన లీగల్ నోటీసులో స్పష్టం చేశారు.
Source: Organiser