Home News పుష్కర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు

పుష్కర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు పుష్కర్ లో ప్రారంభమయ్యాయి. ఇవి మూడు రోజులపాటు (సెప్టెంబర్ 7 – 9) జరుగుతాయి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 35 సంస్థల 200 మంది అఖిల భారతీయ కార్యనిర్వహణాధికారులు ఇందులో పాల్గొంటున్నారు. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ భయ్యాజీ , ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు కూడా సమావేశాల్లో ఉంటారు.

వివిధ రంగాల్లో పనిచేసే సంస్థలకు చెందిన కార్యకర్తలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకుని, జాతీయ విషయాలపై  చర్చించేందుకు ఈ సమావేశాలు తోడ్పడతాయని అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్ తెలియజేశారు. వేటికవే స్వతంత్రమైన ఈ సంస్థలు తమకు సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకుంటాయి. అలాగే ఈ సమావేశాల్లో ఎలాంటి తీర్మానాలు ఆమోదించే కార్యక్రమం కూడా ఉండదు.

సెప్టెంబర్ 9న సమావేశాల ముగింపు సందర్భంగా జరిగే పత్రిక విలేకరుల సమావేశంలో మూడు రోజుల సమావేశాల్లో చర్చించిన అంశాల వివరాలను సహ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే తెలియజేస్తారు.