భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ్ చాలక్ మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ పరిధిలోని భాగ్యనగర్ మహానగర్ (సంభాగ్)లో ఏర్పాటు చేసిన “స్వరఝరి” ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు స్వరఝురి ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇక.. విశేషంగా తరలి వచ్చిన సంగీత అభిమానులతో స్వరఝురి కార్యక్రమం సుమనోహరంగా సాగింది. వివిధ రకాల వాద్యాలు లయబద్దంగా వాయించిన కళాకారులు.. తమ ప్రదర్శన ద్వారా శ్రోతలను కట్టిపడేశారు. ఎంపిక చేయబడ్డ మొత్తం 81 మంది ఘోష్ వాదకుల స్వరఝరి.. ఆహుతులకు వీనుల విందును పంచింది.
శంఖ (bugul), వేణు (side flute), శృంగ (Brass Band), ఆనక్ (Side Drum), పణవ (Boss Drum), ఝల్లరి, త్రిభుజీ వాద్యాలతో భారతీయ రాగాల ఆధారంగా రూపొందించిన రచనలతో కూడిన వాయిద్య వాదన ఆధ్యంతం అలరించింది. అలాగే శివలింగం, త్రిశూలం వ్యూహం, రామ్ మందిరం, కోదండం, భారత నౌకాదళం నూతన చిహ్నం, శివాజీ కాలంలోని అష్టభుజ, యుద్ధ నౌక తేజస్, విక్రమ్ ల్యాండర్, రోవర్, వ్యూహలతో బాటు సంఘ్ సమత (కవాతు) ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేకంగా పెద్దపులి పాట, లింగాస్టకం, రామ్ సియారామ్, సైడ్ డ్రమ్ వాదన అబ్బుపర్చాయి.
ఈ సందర్భంగా మోహన్ జీ భాగవత్ గారితో ప్రముఖ సంగీత కళా విద్వాంసుల తో పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు MM కీరవాణి, గారితో పాటు, Am రత్నం గారు, ఎల్లా వెంకటేశ్వర్ రావు గారు, RP పట్నాయక్, కొమందూరి రామాచారి, KM రాధాకృష్ణ, MM శ్రీలేఖ, సంగీత విద్వాంసులు శ్రీ ప్రేమ రామ్మూర్తి, వేణు గాన విద్వాంసులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్లా బాల మురళి, వనజా ఉదయ్ గారు, డా. జయప్రదా రామమూర్తి, Dr రమా ప్రభ గార్లతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ సంగీత మూల మయినవాటిని తీసుక రావాలి అని కోరారు. సంగీతంలో భారతీయ కరణను పెంపొందించాలని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పూర్తిగా భారతీయ రాగలతోనే సంగీత రచన చేసిందని చెప్పారు.