Home News సికంద్రాబాద్ లో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

సికంద్రాబాద్ లో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

0
SHARE

నేడు విశ్వా వ్యాప్తంగా భారతీయులన్నా, హిందువులన్న ఎంతో గౌరవం పెరిగిందని, రాబోయే రోజులలో సర్వ శక్తివంతమైన దేశంగా భారత్ ఏర్పడబోతున్నదని, సంఘ సంస్థాపకులు డాక్టర్ జీ ఆశించిన అలాంటి విజయం కోసం స్వయంసేవకులందరు కంకణబద్దులై ఉండాలని కోరారు. అదే సమయంలో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనీ, ప్రజల మధ్య భేదాలను నెలకొల్పడానికి కొన్ని విదేశీ శక్తులు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని సూచిస్తూ, సంఘటితం ద్వారానే వాటిని మనం ఎదుర్కోవడం సాధ్యమవుతుందని అందుకు ప్రతి ఒక్కరు తమ భాద్యతగా దేశ హితం కొరకు పని చేయాలని శ్రీ అలె శ్యామ్ కుమార్, ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్, కోరారు.

ప్రసంగిస్తున్న శ్యామ్ జి

ఈ రోజు సికంద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని మహబూబ్ కళాశాల మైదానంలో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి ఉత్సవంలో ముఖ్య వక్తగా పాల్గొన్న శ్యామ్ జి మాట్లాడుతూ 1925 లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్ హెడ్గేవార్ విజయదశమి నాడు ప్రారంభించిన సంఘం గత 93 సంవత్సరాలుగా మానవ విలువలను పెంపొందిస్తూ వ్యక్తి నిర్మాణం, ధార్మిక , సాత్విక శక్తి ఉపాసకులుగా నిర్మాణం చేస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అన్ని దేశాలు భారత దేశ ప్రధానమంత్రి ని కలవడానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయని , భారత్ తో స్నేహం కోసం ముందుకు వస్తున్నాయని తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న నల్సార్ యూనివర్సిటీ న్యాయ కళాశాల ప్రొఫెసర్ శ్రీ కే వి ఆర్ శర్మ మాట్లాడుతూ వ్యక్తి తాను నిర్వహించవలసిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. నేడు కూడా హిమాలయ పర్వతాలలో ఎందరో మహా ఋషులు కఠోర దీక్షలు చేస్తున్నారని, అందుకు ప్రతిఫలంగా మనమందరం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నామని అన్నారు. దేవుళ్ళు పుట్టిన ఈ పుణ్య భూమిలో ప్రజల నడుమ ఎలాంటి కలహాలు లేకుండా , సర్వ మాత సహనం పాటిస్తూ అందరిని కలుపుకొని పోతున్నామన్నారు. పండుగల సందర్భాలలో కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లడం వలన మనసులలో ఉన్న కల్మషాలు దూరం అవుతాయని తెలిపారు.

విజయదశమి ఉత్సవం లో భాగంగా సభా స్థలి వద్ద ఆయుధ పూజ నిర్వహించారు. స్వయంసేవకులు శారీరక విన్యాసాలు ప్రదర్శించారు. వందలాది మంది స్వయంసేవకులు గణవేశ్ లో దండ చేతబట్టి , పవిత్ర భాగద్వజాన్ని పట్టుకొని ఆర్ ఎస్ ఎస్ ఘోష్ తో సహా పురవీధులలో పథ సంచలన్ నిర్వహించారు .