Home News సమాచార వాహిని: 17-నవంబర్-2018

సమాచార వాహిని: 17-నవంబర్-2018

0
SHARE

బయట పడ్డ బ్రిటిష్ డొల్లతనం
ఆసియా బీబీ ఎక్కడ ఉందో తెలిస్తే అల్లరి మూకలు ఆమెను కొట్టి చంపేస్తాయి. అందుకే ఆమె తన దేశం వదిలి మరో దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. సహజంగానే ఆమెను బ్రిటన్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఆసియా బీబీకి ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించింది. ఆమె భద్రతకు తాము హామీ ఇవ్వలేమని, తమ దేశంలో ఉన్న ముస్లింలు ఆమెపై దాడి చేసే ప్రమాదం ఉందని, ఆమె తమ దేశంలో ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని బ్రిటన్ చెబుతోంది. Read More.. 

ఎందుకంత అత్యుత్సాహం? – తస్లీమా నస్రీన్  
దేశంలోని స్రీలు గృహహింస, అత్యాచారం, వేధింపులు, ఆరోగ్యం, ఉద్యోగం, స్వేచ్ఛ వంటి సమస్యలతో సతమతమవుతుంటే వాటిని పరిష్కరించేందుకు గ్రామాల్లో పోరాడాల్సిన మహిళా కార్యకర్తలు శబరిమల ఆలయ ప్రవేశానికి పోరాడటం విడ్డూరంగా ఉందని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. Read More..

శబరిమల వివాదం: నేడు కేరళలో బంద్
శబరిమల కర్మ సమితి అనే సంస్థ సహా పలు సంఘాలు నేడు కేరళ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. సంఘ్‌ పరివార్‌ సీనియర్‌ నేత అయిన ఓ మహిళను అరెస్ట్‌ చేయడానికి నిరసన వ్యక్తంచేస్తూ వీరు ఆందోళనకు దిగారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హిందూ ఐక్యవేది రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళను పోలీసులు అరెస్ట్‌ చేశారని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌జేఆర్‌ కుమార్‌ ఆరోపించారు. 50ఏళ్లు దాటిన ఆమె ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. Read More..