హిందుత్వము, హిందూ జీవన విధానంతోనే లోక కళ్యాణం జరుగుతుందని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ఆదివారం (11 ఫిబ్రవరి) నాడు కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో ఏర్పాటు చేసిన కుల పెద్దలకు సన్మానం,సమరసత సదస్సు కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన వారు మాట్లాడుతూ కులాల అసమానతలను వదిలి కలిసి మెలిసి జీవించాలని, సమరసత వాతావరణం నిర్మాణం జరగాలని ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటి చెప్పాలన్నారు.
మహాత్ముల ఆశయాలే మన వారసత్వం అని, మనుషులు సంఘ జీవులు కావున సంఘటితంగానే జీవించాలన్నారు. కుల అసమానతలు, అంటరానితనం నిర్మూలన వల్లనే సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు.
అనంతరం గ్రామంలోని కుల వృత్తులు చేస్తున్న 18 కులాలకు చెందిన పెద్దలను సన్మానించారు. వారితో పాటు గ్రామంలోని 5 యువజన సంఘాల వారికి యువతకు సంబందించిన పుస్తకాలు అందచేశారు.
కామారెడ్డి జిల్లా సామాజిక సమరసత వేదిక బాద్యులు డాక్టర్ మల్లికజార్జున్ గారు మాట్లుడుతూ మన దేశంలో 6 వేల కులాలు ఉన్నాయని, 1600 కు పైగా భాషలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని జీవించటం అలవార్చుకోవలన్నారు.
కార్యక్రమ నిర్వహణ పూర్తిగా షెడ్యుల్ కులాలకు చెందినవారు చేయడం విశేషం.
సదాశివ నగర్ జరిగిన ఈ కార్యక్రమానికి మహేష్, ఆస రాజేశ్వర్, నాగరాజు, రాజేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.