సంఝవుతా ఎక్ష్ప్రెస్స్ మీద బాంబు దాడి కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసీమానందతో పాటు మరో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఫిబ్రవరి 18, 2007 సంవత్సరంలో ఢిల్లీ – లాహోర్ నగరాల మధ్య నడిచే సంఝవుతా ఎక్ష్ప్రెస్ అంతర్జాతీయ రైలు హర్యానాలోని పానిపట్ జిల్లలో బాంబుదాడికి గురైంది. ఈ తీవ్రవాద దుశ్చర్యలో 68 మంది మరణించారు. మృతుల్లో 19 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణపై స్వామి అసీమానంద అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన అప్పటి జాతీయ దర్యాప్తు సంస్థ నిందితులు కుట్రపూరితంగా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.
ఎట్టకేలకు కేసుని విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక న్యాయస్థానం స్వామీ అసీమానందతో పాటు లోకేష్ శర్మ, కమల్ చౌహన్ మరియు రాజేందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది.