
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్ లోని చమాన్ హనుమాన్ దేవాలయంలో ఆదివారం సంత్ రవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ పూజారి కృష్ణ పంతులు రవిదాస్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ,ప్రసాదాలు అందచేశారు. సమరసత వేదిక ఆధ్వర్యంలో సమరసత సందేశం పత్రికలు అందచేశారు.ఈ కార్యక్రమంలో సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మచ్చేంద్రనాథ్ తో పాటు పవన్ కుమార్, మోచి సంఘం యాదగిరి, ప్రవీణ్, బాలాజీ, తుల్జమ్మ, శంకర్, జితెందర్ తదితరులు పాల్గొన్నారు.
