- మానస సరోవర యాత్ర నిలుపుదల
- గ్లోబల్ టైమ్స్ హెచ్చరికలు
ఇంతకుముందు నుండే వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ తరచూ భారత్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నా ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగలేదు. అధికారుల స్థాయిలో జోక్యంతో సమసిపోతున్నాయి. అయితే ఈసారి చైనా డోక్లామ్‌లో తిష్టవేసి భారత్‌కు నిర్దుష్టమైన సందేశం పంపింది. ఈ సందర్భంలో సిలిగురి కారిడార్‌కు 5 కి.మీ. దూరంలో గల డోక్లామ్ వద్ద రెండు భారతీయ బంకర్లను కూడా ధ్వంసం చేసారు. ఈశాన్య ప్రాంతాలను మిగతా భారతదేశంతో, నేపాల్, భూటాన్లతో కలిపి ఉంచేదే సిలిగురి కారిడార్.
చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్ పట్ల తన విపరీత ధోరణిని ఈ విధంగా ప్రదర్శించింది – ‘అన్ని మార్గాల ద్వారా’ న్యూ ఢిల్లీకి ‘నియమాలు తెలియచెప్పాలి’, ‘ఇది భారత్‌కు చైనా పట్ల అహంకారాన్ని ప్రదర్శించే సమయం కాదు. భారత జిడిపి చైనాలో నాలుగోవంతు మాత్రమే. వార్షిక రక్షణ బడ్జెట్ మూడో వంతు మాత్రమే. స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం, చైనా సరిహద్దులో గల సమస్యలను జాగ్రత్తగా చేపట్టడం భారత్ ప్రయోజనాలకే మేలు’ అంటూ ముగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని విదేశీ విధాన పరిశీలకులు మొదట్లో అంచనాలు వేశారు. కాని వారి అంచనాలు తలకిందులు కావడమే కాకుండా భారత్ – అమెరికా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ‘ద్వైపాక్షిక సంబంధాలు నేటికన్నా ఎన్నడూ మెరుగ్గా లేవు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఆగ్రహించిన చైనా
వాస్తవానికి మెరుగైన ఈ రెండు దేశాల సంబంధాలపై చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ బుద్ధిపూర్వకంగా, అసహ్యకరంగా అసంతప్తి వ్యక్తం చేసింది. ఒకవిధంగా ఆగ్రహించింది. అంతలా భారత్-అమెరికాల మధ్య మోది పర్యటనతో సరికొత్త సారూప్యత వ్యక్తం అవుతున్నది.
ద్వైపాక్షిక చర్చల కోసం మోది – ట్రంప్ కలవడానికి కొద్ది గంటల ముందు చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ భారత్ పట్ల తన ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేసింది. – ‘ఈ మధ్య కాలంలో చైనాపై భౌగోళిక, రాజకీయ వత్తిడి తీసుకురావడానికి అమెరికా భారత్ వైపు చూస్తున్నది. అయితే జపాన్ లేదా ఆస్ట్రేలియాల వలె భారత్ అమెరికాకు సన్నిహిత దేశం కాదు. చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా భారత్‌ను కూడా తన స్థావరంగా మార్చుకోవాలని చూస్తున్నది. అలా అమెరికాకు స్థావరంగా మారడం భారతదేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు. పైగా విపత్కర ఫలితాలకు కూడా దారితీస్తుంది. చైనాను ఎదుర్కోవడం కోసం భారత్ తన అలీన విధానం నుండి వెనుదిరిగి అమెరికా చేతిలో పావుగా మారితే అది వ్యూహాత్మక అనిశ్చితిలో పడుతుంది. దక్షిణ ఆసియాలో నూతన ప్రాంతీయ రాజకీయ ఘర్షణలకు దారితీస్తుంది’.
ఈ బెదిరింపు; నిరుత్సాహపరచే, ధిక్కరింపు చైనా ధోరణులు ఈ మధ్య జరిగిన మోది-ట్రంప్ సమావేశం సందర్భంగా వెల్లడైనవి.
భారత్‌కు విజయం – చైనాకు వణుకు
ఇంతకుముందు కూడా మోది అమెరికాలో పర్యటించారు. ఆయా పర్యటనలలో నిర్దుష్టంగా కొన్ని ఒప్పందాలు, నిర్ణయాలు స్పష్టంగా చోటు చేసుకున్నాయి. ఈసారి పర్యటనలో అటువంటి నిర్దిష్ట ఫలితాలు కనబడలేదు. భారతీయులపై జాతి వివక్ష నేరాలు, హెచ్1బి వీసాలు వంటి అంశాలను లేవనెత్తడంలో మోది విఫలం అయ్యారని కొందరు భారతీయులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే తరచూ చైనా యుద్ధ నౌకలు సంచరించే హిందూ మహాసముద్రంలో భారత నావికాదళానికి నిఘా సామర్ధ్యం కల్పించడం కోసం మన దేశానికి 2 బిలియన్ డాలర్ల విలువ గల 22 గార్డియన్ డ్రోన్లను సరఫరా చేయడానికి అమెరికా ఆమోదం తెలిపింది. మోది – ట్రంప్ సమావేశానికి కొద్ది గంటల ముందు హిజబుల్ ముజాహిదీన్ అధిపతి సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది.
వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం భారతదేశం వైపు నుండి జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి యస్ జైశంకర్ సమర్థవంతమైన రీతిలో భారత్ వాదనలను బలపరిచారు. రెండు దేశాల మధ్య గల సారూప్యతలు, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలు కాశ్మీర్ విషయంలో భారత్ వాదనలను బలపరచడానికి ఈ పర్యటన దోహదపడింది. గత సంవత్సరం బ్రిక్స్-బిమ్స్టెక్ సమావేశంలో పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేయడానికి భారత్ ప్రయత్నం చేసినా చైనా పడనీయలేదు. పాకిస్తాన్‌ను, దాని ఉగ్రవాద సంస్థను ఈ పర్యటన సందర్భంగా అమెరికా స్పష్టంగా ఖండించడం భారత్‌కు నైతిక విజయం.
రెండు దేశాలు ఇస్లామాబాద్ చర్యలను ఖండిస్తూ ఆల్ ఖైదా, జైష్-ఎ-మహమ్మద్, ఎల్ ఇ టి, డి-కంపెనీ వంటి బందాలకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రతిజ్ఞ పూని, ‘అంతర్గత, అంతర్జాతీయ ఉగ్రవాదులను గుర్తించడంలో నూతన సంప్రదింపుల యంత్రాంగం’ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ఐక్యరాజ్య సమితి వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద బృందాలను తీవ్రంగా ఖండించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకొంటున్న సమయంలో భారత్‌కు ఈ పరిణామం ఎంతో హర్షణీయం. అమెరికా ఇప్పుడు పాకిస్థాన్‌పై సహనం కోల్పోతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో దిగజారుతున్న భద్రత పరిస్థితుల దష్ట్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తున్నది. పైగా, దేశాల సరిహద్దు, సముద్ర వివాదా లను అంతర్జాతీయ చట్టం ప్రకారం పరిష్కరించు కోవాలని రెండు దేశాలు స్పష్టం చేయడం గమనార్హం.
ఈ ప్రకియలో అమెరికా ఒబిఒఆర్ (చైనా ప్రాజెక్టు) విషయంలో భారత్ విధానాన్ని ఆమోదిస్తూ అనుసంధాన చర్యలు ‘బాధ్యతయుత రుణ విధానాలు’ కు కట్టుబడి ఉండాలని, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, పర్యావరణ అంశాలను దష్టిలో ఉంచుకోవాలని, నిబంధనలను పాటించాలని కూడా పేర్కొన్నది. సముద్ర ప్రాంత వ్యూహాత్మక సహకారాన్ని విస్తత పరచుకొంటూ రెండు దేశాలు సారూప్యం గల సముద్రతీర లక్ష్యాలను విస్తత పరుచుకోవడానికి అంగీకరించాయి.
భారత్-అమెరికాల మధ్య పెంపొందిన సారూప్యత చైనాను ఇరకాటంలో పడవేసింది. పైగా, తన సరిహద్దుల గుండా సరుకులు పంపడానికి ఇస్లామాబాద్ నిరాకరించడంతో ఆకాశ మార్గంలో కాబూల్‌తో వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని భారత్ నిర్ణయించడం కూడా చైనాకు ఆగ్రహం కల్గించింది.
మోది అనుసరించిన నిశ్చితమైన దౌత్య సంబంధాలు, ఒబిఒఆర్ను పారదర్శకత లేని వ్యవస్థగా చిత్రీకరించగల్గడం, ప్రాదేశిక సార్వభౌమా ధికారం వంటివి చైనీయులకు వణుకు పుట్టించాయి. భారతదేశ వ్యాఖ్యల కారణంగా ఒబిఒఆర్ను అభివద్ధి కార్యక్రమంగా చైనా చేస్తున్న వాదనలను అంగీక రించడానికి ఐరోపా యూనియన్ తిరస్కరించింది. ఇప్పుడు ఐరోపా యూనియన్ చైనాకు సంబంధించిన దిగుమతి నిరోధక చట్టాలను సమీక్షిస్తున్నది.
ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించినప్పటి నుండి ‘చైనా-కేంద్ర ఆసియా’ సిద్ధాంతాన్ని పెంపొందిస్తున్న సమయంలో న్యూఢిల్లీ నెమ్మదిగానైనా స్థిరంగా ప్రాంతీయ రాజకీయాలలో ఎదుగుతున్నది. మోది విజయవంతంగా అమెరికాతో ఏర్పర్చుకున్న సంబంధాలు ‘భారత్ సామర్థ్యం గల పోటీ దారునిగా ఎదుగుతున్నది’ అనే బీజింగ్ సంకోచాలకు బలం చేకూర్చినట్లయింది. అదే సమయంలో, ఉత్తర కొరియాకు కళ్లెం వేయడంలో చైనా ప్రయత్నాలు ప్రభావవంతంగా లేవని భావిస్తున్న ట్రంప్ ఎదుగుతున్న చైనాను కట్టడి చేయడం కోసం వ్యూహాత్మకంగా భారత్ ప్రాధాన్యాన్ని గుర్తించేటట్లు చేయగలిగారు. ఈ పరిణామాలతో విసుగు చెందిన చైనా భారత్‌కు వ్యతిరేకంగా దురహంకార వాఖ్యలకు దిగింది.
భారత్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా
మోది అమెరికా పర్యటనలో సాధించిన విజయాలను జీర్ణించుకోలేని చైనా భారత్‌లోని సిక్కిం సరిహద్దులో డోక్లామ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. ఇలా భారత్ భూభాగంలోకి ప్రవేశించడం ద్వారా చైనా భారత్‌ను హెచ్చరించినట్లయింది. డోక్లామ్ ప్రాంతం భారత్-భూటాన్‌ల మధ్య గల పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ యస్ ఆకారంలో ఉండే చుంబి లోయ చాల ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ బలమైన సైనిక సదుపాయాలు కల్పించడానికి అవకాశాలు చాల తక్కువ. ఒకవేళ చైనా భారత్‌పై దాడి చేయదలిస్తే, ఆ దాడిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన సేనలను భారత్ పంపలేదు. 4,057 కి.మీ. మేరకు గల భారత్- చైనా సరిహద్దు మొత్తంలో చైనాకు అనువైన వ్యూహాత్మక భూభాగం ఇది మాత్రమే.
ఇంతకుముందు నుండే వాస్తవాధీన రేఖ వెంబడి ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ తరచూ భారత్ భూభాగం లోకి ప్రవేశిస్తున్నా ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగలేదు. అధికారుల స్థాయిలో జోక్యంతో సమసిపోతున్నాయి. అయితే ఈసారి చైనా డోక్లామ్‌లో తిష్టవేసి భారత్‌కు నిర్దుష్టమైన సందేశం పంపింది. ఈ సందర్భంలో సిలిగురి కారిడార్‌కు 5 కి.మీ. దూరంలో గల డోక్లామ్ వద్ద రెండు భారతీయ బంకర్లను కూడా ధ్వంసం చేసారు. ఈశాన్య ప్రాంతాలను మిగతా భారతదేశంతో, నేపాల్, భూటాన్లతో కలిపి ఉంచేదే సిలిగురి కారిడార్.
ఇది భారత్, భూటాన్, బాంగ్లాదేశ్లను కలిపే ప్రాంతం కావడమే గాక భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు కీలకమైనది కూడా. సిలిగురి కారిడార్‌పై ఆధిపత్యం వహించడం ద్వారా చైనా ఈశాన్య ప్రాంతాలతో భారత్ అనుసంధానాన్ని నిరోధించడంతో పాటు బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతానికి చేరుకోగలదు. డోక్లామ్ దురాక్రమణతో పాటు చైనా అధ్యక్షుడు జీ 2014లో భారత్ పర్యటన సందర్భంగా అంగీక రించిన మేరకు ప్రస్తుతం జరుగుతున్న నాథులాపాస్ గుండా కైలాస మానసరోవర్ యాత్రను కూడా చైనా నిలిపి వేసింది.
వాస్తవానికి సిలిగురి కారిడార్, భారత్దేశపు ప్రాదేశిక వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఒబిఒఆర్ కు కీలకమైన అవాంతరాలు. సిపిఇసి ప్రాజెక్టు ద్వారా భారత దేశపు చట్టబద్ధ భూభాగం గుండా పాకిస్తాన్ లోని గ్వాదర్ ప్రాంతం వద్ద హిందూ మహాసము ద్రానికి చేరుకోవాలని చైనా భావిస్తున్నది. యున్నాన్, మయాన్మార్, ఇర్రవాడి కారిడార్లను అనుసంధానం చేయడంలో సిలిగురి కారిడార్ కీలకమైన లింక్. అందుకనే డోక్లామ్ వద్ద చైనా జరిపిన దురాక్రమణ రెండు విధాల ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇది హెచ్చరికా..!
డోక్లామ్ దురాక్రమణ ద్వారా అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకోవద్దని భారత్‌కు ప్రాదేశిక రాజకీయ సందేశం పంపే ప్రయత్నం చైనా చేసింది. ఈ సమయంలోనే పాకిస్తాన్ ను సమర్ధిస్తూ చైనా చేసిన ప్రకటన గమనించదగింది. ‘మేము అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాము. ఉగ్రవాదం పేరుతో కొన్ని దేశాలతో సంబంధం ఏర్పర్చడాన్ని కూడా వ్యతిరేకిస్తామని మేము స్పష్టం చేయదలచుకున్నాము’. అమెరికా సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తరువాత చేసిన ఈ ప్రకటన పరిగణించ వలసినదే.
వాస్తవానికి చైనా నిరసనలతో వత్తిడి తెచ్చినప్పటికీ గత ఏప్రిల్‌లో తవాంగ్‌లో దలైలామా పర్యటనను నిలిపి వేయడానికి భారత్ తిరస్కరించ డంతో భారత్ – చైనా సంబంధాలు చాల హీనస్థితికి చేరుకున్నాయి. అప్పటి నుండి భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివద్ధి ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడం, అస్సాంలో ఆసియాలోనే పొడవైన వంతెనను ధోలా-సాదియాల మధ్య ప్రారంభించడం, చైనా జరిపిన బిఆర్ఎఫ్ సదస్సుకు భారత్ గైర్హాజరు కావడం వంటి వరుసగా జరిగిన పరిణామాలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి.
ఈ సందర్భంగా తన విపరీత ధోరణిని గ్లోబల్ టైమ్స్ ఈ విధంగా ప్రదర్శించింది – ‘అన్ని మార్గాల ద్వారా’ న్యూ ఢిల్లీకి ‘నియమాలు తెలియచెప్పాలి’, ‘ఇది భారత్‌కు చైనా పట్ల అహంకారాన్ని ప్రదర్శించే సమయం కాదు. భారత జిడిపి చైనాలో నాలుగో వంతు మాత్రమే. వార్షిక రక్షణ బడ్జెట్ మూడో వంతు మాత్రమే. స్నేహపూర్వక సంబంధాలు కొన సాగించడం, చైనా సరిహద్దులో గల సమస్యలను జాగ్రత్తగా చేపట్టడం భారత్ ప్రయోజనాలకే మేలు’ అంటూ ముగించింది.
భూటాన్ వివాదం
చైనాతో వివాదం గల మరో దేశం భూటాన్. ఇది సిక్కిం వద్ద భారత్-టిబెట్ల మధ్య గల చిన్న దేశం. టిబెట్‌ను చైనా ఆక్రమించుకొన్నప్పటి నుండి భూటాన్, చైనాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రెండు దేశాల మధ్య 764 చ.కి.మీ. మేర గల భూభాగానికి సంబంధించి అపరిష్కతం వివాదాలు నెలకొన్నాయి. ఆ వివాదాలలో ఉత్తర-మధ్య ప్రాంతంలోని 495 చ.కి.మీ. ప్రాంతమైన జేకురులుంగ్, పసములుంగ్ లోయలు, పశ్చిమాన 269 చ.కి.మీ. డోక్లామ్ పీఠభూమి కూడా ఉన్నాయి. అరచేయి వలే టిబెట్‌కు ఐదు వేళ్ళుగా -లడఖ్, సిక్కిం, నేపాల్, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ ఉన్నాయని మావో జెడాంగ్ భావించారు.
నేపాల్, భూటాన్, సిక్కిం తనకు చెందినవే అంటూ చైనా దూకుడుగా వాదిస్తున్నది. టిబెట్‌ను ఆక్రమించుకున్న సమయంలో పశ్చిమ ప్రాంతంలో భూటాన్‌కు చెందిన ఎనిమిది ప్రాంతాలను కూడా చైనా ఆక్రమించింది. చైనా దురాక్రమణతో భూటాన్‌కు భారత్‌ను ఆలింగనం చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది.
1949లో భూటాన్ ‘శాశ్వత శాంతి, స్నేహం ఒప్పందం’పై సంతకం చేసింది. దానితో భూటాన్‌కు ‘సంరక్షణ’ గా భారత్ ఉంటున్నదని చైనా నిందిస్తుస్తున్నది. టిబెట్ ప్రజల ప్రతిఘటన ఉద్యమాన్ని చైనా క్రూరంగా అణచివేయడం, టిబెట్ ప్రజల బౌద్ధమతం పట్ల భీకరమైన దాడి కారణంగా భారత్‌తో సంబంధాలను భూటాన్ పటిష్టం చేసుకోవలసి వచ్చింది. తరువాత ఆర్థిక, సైనిక సహాయాన్ని అందించడంతో పాటు భూటాన్ రాయల్ సైన్యానికి శిక్షణ ఇవ్వడం కోసం వేయి మంది భారతీయ శిక్షణ బృందాన్ని భారత్ భూటాన్‌కు అందించింది.
1962 చైనా-భారత్ యుద్ధంలో భారత్ ఓటమి చెందడంతో తమను కాపాడటం అటుంచి తనను తాను రక్షించుకోగల భారత్ సామర్థ్యం పట్ల భూటాన్‌కు అనుమానం కలిగింది. భూటాన్ నెమ్మదిగా చైనాకు దగ్గరగా జరగడం ప్రారంభమైంది. 1972 నుండి 1984 వరకు భూటాన్-చైనా సరిహద్దు సంభాషణలలో భారత్ పాల్గొంది. 1984 నుండి భూటాన్ నేరుగా చైనాతో మాట్లాడటం ప్రారంభించింది.
1996లో భూటాన్‌కు ఒక ‘ప్యాకేజి ఒప్పందం’ ను చైనా ఇవ్వజూపింది. దీని ప్రకారం డోక్లామ్, చరితంగ్, సించులుప, డ్రామానా వంటి గ్రామీణ డొక్కలం పీఠభూమిని అప్పజెబితే జేకురులుంగ్, పసములుంగ్ లోయలపై తమ వాదనలను విరమించుకుంటామని చెప్పింది. డోక్లామ్ పీఠభూమి భారత్, చైనా, భూటాన్‌లకు జంక్షన్ కావడమే గాక సిలిగురి కారిడార్‌కు దగ్గర్లో ఉండడంతో వ్యూహాత్మకంగా చాల ప్రాధాన్యం గల ప్రాంతం. అయితే డోక్లామ్ సంపన్నమైన గ్రామీణ ప్రాంతం కావడంతో వదులుకోవడానికి భూటాన్ సిద్ధంగా లేదు. డోక్లామ్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గ్రహించిన భారత్ ఆ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో సేనలను మోహరించింది.
టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో యస్ ఆకారంలో ఉన్న చుంబి లోయ ఇరుకుగా ఉండటం, తన కుయుక్తులకు అనుకూలంగా లేక పోవడంతో ఎట్లాగైనా సరే డోక్లామ్ పీఠభూమిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నం చేస్తున్నది. అందుకే చుంబి లోయలో చైనా మౌలిక సదుపాయాలను అభివద్ధి చేయడం ప్రారంభించింది.
1998లో ‘భూటాన్-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి నెలకొల్పడం కోసం ఒప్పందం’ పై సంతకాలు చేసుకోవడం ద్వారా అప్పుడు నెలకొన్న పరిస్థితిని కొనసాగించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. భూటాన్ రాజరికం నుండి క్రమంగా ప్రజాస్వామ్యం వైపు వెడుతూండడంతో 1949 నాటి ‘భారత్-భూటాన్ స్నేహ ఒప్పందం’ ను 2007లో మార్చింది.
1998 నాటి ఒప్పందం తరువాత కూడా చైనా నిరంతరం డోక్లామ్ పీఠభూమికి చేరుకొనే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పరచు కొంటూ వస్తున్నది. డోక్లామ్ ప్రాంతంలో చుంబి లోయకు ఆనుకుని ఉన్న చరితంగ్ను చైనా అధీనంలో గల టిబెట్‌లోని లాసా కు అనుసంధానం చేసే పనిని వేగం చేస్తున్నది. దక్షిణ చైనా సముద్రానికి చేరుకొనే విధంగా భూటాన్ భూభాగం ద్వారా పలు పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నది.
పిఎల్‌ఎకు సత్కారం – భారత్‌కు హెచ్చరిక
చుంబి లోయ సమీపంలో ఉన్న తన పియల్ఎ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) యూనిట్‌ను చైనా సత్కరించింది. ఈ సంఘటనతో చైనా డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన విషయం, అక్కడ మౌలిక సదుపాయాలను దూకుడుగా అభివద్ధి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అంతకుముందే చైనాను దష్టిలో ఉంచుకొని భారత్ 90,274 మంది అదనపు సైనికులతో 17 పర్వత ప్రాంతాలలో దాడులు జరుపగల బృందాలను అభివద్ధి చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా వంద టి-22 యుద్ధ ట్యాంక్‌లను లడఖ్‌కు, సుఖోయ్-30 యుద్ధ విమానాలను పసిగత్కు పంపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దుకు సమీపంలో ఉన్న పలు బృందాలను క్రియాశీలం చేసింది. ఈ భారత నిర్ణయానికి ప్రతిగా చైనా పిఎల్ఎ యూనిట్‌ను సత్కరించింది.
పియల్ఏ యూనిట్‌కు సత్కారం చేయడం ద్వారా తాము సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని చాల తెలివిగా చైనా భారత్ కు పంపింది. పైగా అదనపు దళాలను చుంబి లోయకు పంపి, జె-20 రహస్య యుద్ధ విమానాలను, యఫ్ సి-1 క్సీలోలోంగ్ తేలికపాటి యుద్ధ విమానాలను మోహరించింది.
– డా||రామహరిత
జాగృతి సౌజన్యం తో
For regular updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp