తిరువనంతపురం: ప్రకృతి బీభత్సానికి కేరళ అతలాకుతలమైంది. భారీ వర్షాలతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘటనతో ఆయా గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – సేవాభారతి కార్యకర్తల వెంటనే స్పందించి తాత్కాలిక వంతెన నిర్మించాలని సంకల్పించారు. స్థానికులను కలిసి, సమిష్టిగా వంతెన నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామవాసులు సేవాభారతి కార్యకర్తల సేవలను అభినందించారు.