అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని సేవాభారతి స్వచ్చంద సంస్థ వారు వనపర్తి జిల్లా కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో స్థానికంగా ఉన్న ఎస్.సి/ఎస్.టి/బి.సి వసతి గృహాలలో ఉంటున్న 700 మంది విద్యార్థులకు వివిధ రంగాలలో నిష్ణాతులు అయిన వైద్యులు తగిన పరిక్షలు చేసి విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సూచనలు సలహాలతో పాటు అనారోగ్యంగా ఉన్న పిల్లలకు మందులు అందివ్వడం జరిగింది. పిల్లలకు ఆహారపు అలవాట్లు, నిత్య జీవితంలో వ్యాయామం వాటి వలన కలిగే ప్రయోజనాలు గురించి వివరించడం జరిగింది. ఈ వైద్య శిబిరం లో డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డా. రాఘవేంద్ర, డా. సురేంద్ర మరియు డా. చల్మా రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ హెల్త్ క్యాంప్ కు జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీ జనార్ధన్ గారు, ఆర్.ఎస్.ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ వాసుజీ, జిల్లా కార్యవాహ శ్రీ నాగక్రిష్ణ, అమరేందర్, కురుమూర్తి, కొంకాల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న పిల్లలకు అంబేద్కర్ జీవిత చరిత్ర కు సంబదించిన పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది.