
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన సహాయక సామాగ్రిని భాగ్యనగర్, నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాసంస్థల ప్రాంగణంలో సేవాభారతి ఉంచింది. విడతలవారీగా ఆయా వరద బాధిత ప్రాంతాలకు సహాయక సామాగ్రిని చేరవేయడంలో సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు చురుకైన పాత్రను పోషిస్తున్నారు.
వరదల కారణంగా మంచిర్యాలలో నీటమునిగిన స్థానిక ఎన్టీఆర్ నగర్ కాలనీలో సేవాభారతి ఆధ్వర్యంలో కుటుంబాల సర్వే చేశారు.