
ఊదా దేవి
పులివలె చెలగె గద తొలి సంగరమునను
ఉగ్ర రూపునున్న ఊదదేవి
ముష్కరులను నరికె ముప్పది రెండుగా
వినుర భారతీయ వీర చరిత
భావము:
లక్నోకు చెందిన పాసీదళిత మహిళ ఊదా దేవి. 1857 నాటి స్వరాజ్య సంగ్రామ సమయంలో సికందర్ బాగ్‌లో తెల్లవారితో తలపడ్డారు. 32 మంది ఆంగ్లేయుల తలలు నరికిన ధీర వనిత ఊదాదేవి. భరతమాత పాదాల చెంత అమరత్వాన్ని పొందిన ఆ వీరాంగణ చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్