దేశ వ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న పనిలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు. యువతతో పాటు, సమాజంలోని ఆలోచనాపరులు, మేధావులు, ప్రముఖులు సైతం సంఘ కార్యం పట్ల ఆసక్తి చూపుతున్నారని ఆర్ ఎస్ ఎస్ ప్రాంత కార్యవాహ (రాష్ట్ర కార్యదర్శి) శ్రీ కాచం రమేష్, అన్నారు.
ఇటివల నాగపూర్ లో జరిగిన ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిది సభ విశేషాలను ఆయన హైదరాబాద్ లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వివరించారు.
సమావేశంలో మాట్లాడుతూ గత 8 సంవత్సరాలలో తెలంగాణాలో శాఖలు 1000కి పైగా పెరిగాయని, ప్రస్తుతం 1608 ప్రదేశాలలో 2412 శాఖలు జరుగుతున్నాయని తెలిపారు. అదే 2017లో 1495 ప్రదేశాలలో 2302 శాఖలు ఉండేవి.
సమాజంలో సామజిక సమరసత సాధించడానికి స్వయంసేవకులు, సాధుసంతుల సహాయ సహకారాలతో, ఎంపిక చేసుకున్న కొన్ని గ్రామాలలో సద్భావన సదస్సులు, అందరికి మందిర ప్రవేశం లాంటి ప్రయత్నాలు చేశారని ఆయన వెల్లడించారు. దాని కారణంగా 200 గ్రామాల్లో ఒకే స్మశానం వాడకం, అందరికీ దేవాలయ ప్రవేశం, హోటళ్లలో అందరూ ఉపయోగించడానికి ఒకే రకం గ్లాసులు వంటివి సాధ్యమయ్యాయని అన్నారు.
ఈ సంవత్సరం అఖిల భారతీయ ప్రతినిది సభ ‘భారతీయ భాషలను పరిరక్షించుకోవాలి’ అనే తీర్మానం ఆమోదించిందని తెలుపుతూ, సంఘం దేశంలోని అన్ని భాషలకు సమాన గౌరవం, హోదా ఇస్తుందని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, అద్భుతమైన జ్ఞాన సంపద, అపారమైన సాహిత్యాన్ని పరిరక్షించుకోవడంలో, అలాగే సృజనాత్మక ఆలోచనను పెంపొందించడంలో దేశంలోని వివిధ భాషలు, మాండలీకాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమమంలో రమేష్ జీ తో పాటు ప్రాంత సహ సంఘచాలక్ శ్రీ సుందర్ రెడ్డి , ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయుష్, పాల్గొన్నారు.
పత్రికల వారికి విడుదల చేసిన పూర్తి వార్షిక నివేదిక ( Telugu) English
అఖిల భారతీయ ప్రతినిది సభ చేసిన తీర్మానం, ‘భారతీయ భాషలను పరిరక్షించుకోవాలి’
(rss.org సౌజన్యం తో)