ఎన్నో ఆక్రమణలు, ఎంతో సుదీర్ఘ పరిపాలన తర్వాత కూడా తెలుగు సాహిత్యం ఉన్నతంగా నిలబడింది. మన దేశంలోని అన్ని భాషలు అదేవిధంగా నిలబడ్డాయి. స్వ – లో స్వభాష కూడా ఉంది. ఆంగ్లేయులను దేశం నుంచి తరమడానికి మాత్రమే మనం సంఘర్షణ చేయలేదు, మన స్వధర్మాన్ని, సంస్కృతిని కాపాడటానికి కూడా సంఘర్షణ చేశాం. ఈ దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలో రాజ్యాంగ నిర్మాతలు రాముని చిత్రంతో మనకు సూచించారు. దాని కోసం మన భావితరం, యువతరం కృషి చేయాలి. సాహిత్య రంగంలో మార్పు వస్తోంది. దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మన సాహిత్య ప్రవాహంలో కుహనా చరిత్ర కొట్టుకు పోవాలి. యువకుల ఆలోచనలలో విప్లవం వచ్చింది. గతంలో అందించిన తప్పుడు చరిత్రను మార్చాలని వారు ప్రయత్నిస్తున్నారు.