Home News శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం

శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం

0
SHARE

ద్వారకా శారదా పీఠాధిప‌తి స్వామి స్వరూపానంద సరస్వతి గారు శివైక్యం చెందారు. 99 ఏళ్ల వ‌య‌సున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. ఈ ఆదివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ జిల్లాలోని శ్రీధమ్ జోతేశ్వర్ ఆశ్రమంలోఆయ‌న తుది శ్వాస విడిచారు.

ఆది గురు భగవాన్ శంకరాచార్య 1300 సంవత్సరాల క్రితం హిందూ మత అనుచరులను ఏకంచేసి మతపరమైన అభ్యున్నతిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా నాలుగు మత ఆశ్రమాలను స్థాపించారు.
అందులో స్వామి స్వరూపానంద సరస్వతి గారు ద్వారకా-శారదా పీఠం (గుజరాత్‌లో) శంకరాచార్యగా, జ్యోతిర్‌ పీఠం (ఉత్తరాఖండ్‌లో) అధిపతిగా ఉన్నారు.

స్వామి స్వరూపనంద సరస్వతి గారు 1924 మధ్యప్రదేశ్ సియోని జిల్లాలోని దిఘోరి గ్రామంలో జన్మించారు. 1941 నుండి 1953 వ‌ర‌కు జైత్రి మఠ పీఠాధిప‌తి శ్రీ బ్ర‌హ్మానంద సరస్వతికి ప్ర‌ధాన శిష్యుడిగా ఉన్నారు.

తొమ్మిదేళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టి, హిందూ మతాన్ని ఉన్నతీకరించడానికి మతపరమైన యాత్రను ప్రారంభించాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన స్వరూపానంద సరస్వతి గారు కాశీకి వచ్చి స్వామి కర్పాత్రి మహారాజ్ వద్ద వేద పాఠాలు నేర్చుకున్నారు.

స్వాతంత్య్ర‌ పోరాట ఉద్యమంలో పాల్గొన్న స్వరూపానంద సరస్వతి విప్లవ సాధువుగా గుర్తింపు పొందారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం న్యాయపోరాటానికి స్వరూపానంద సరస్వతి కూడా సహకరించారు. జమ్మూ కాశ్మీర్, ఆర్టికల్ 370 తొల‌గించాల‌ని, దీని వల్ల లోయ వాసులకు ప్రయోజనం చేకూరుతుందని అందుకు స‌హ‌క‌రిస్తూ ఆయ‌న ప‌లు ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు.

స్వామి స్వరూపానంద శివైక్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.