Home Telugu Articles తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో స్వేరోల పేరుతో ఆధిపత్యం

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల్లో స్వేరోల పేరుతో ఆధిపత్యం

0
SHARE

– గురుకులాలపై స్వేరో పెత్తనమేంధీ
– చెప్పేది ఒక్కటి చేసిది ఒక్కటి
– వారు చెప్పిందే వేదం
– చేసేది శాసనంలా ఉంది
– గురుకులాలకు వారు చేసే అభివృద్ధి ఏంటీ?
– వారి వారి జేబులు నింపుకోవడం తప్ప
– పిల్లల తల్లిదండ్రుల ఆవేదన

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాలో అసలేం జరుగతుందో అర్ధం కాని విధంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు  చెబుతున్నారు. గురుకుల సంస్థ వారి సొత్తుగా భావిస్తున్నారా అనేది అర్ధం కాకుండా ఉంది. గురుకులాలలో చదివిన పూర్వ విద్యార్థులు అంతా ఒక కమిటి గా ఏర్పడి గురుకులాలను అభివృద్ధి చేస్తామంటూ గురుకులాల అభివృద్ధి గాని గురుకుల విద్యార్థులకు మేలు గాని వారు చేసేది ఏమి లేదు. వారి వారి జేబులు నింపుకోవడం తప్ప. స్వేరో అంతే సోషల్ వెల్ఫేర్ ఆరోస్ గా  ఉన్నతమైన ఆశయం కలిగిన పేరుతో ముందుకు వచ్చి గురుకులాలపై స్వేరో ముసుగులో చేస్తున్న కార్యకలాపాలు ఎలా ఉన్నాయంటే స్వేరో కమిటికి నాయకత్వం వహించి నాయకులుగా ముందుండి గురుకులాల్లో ఉండే కాంట్రాక్టు ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఏజన్సీలు, గురుకుల విద్యార్థులకు నిత్యం అవసరం అయ్యే వస్తువులను సరఫరా చేయుటకు ఆ టెండర్లను వారే పూర్తిగా వశ పరచుకొని వారు ఏది సరఫరా చేస్తే అదే నాణ్యమైనదిగా భావిస్తూ వారు చెప్పిందే వేదం వారు చేసేదే శాసనంగా మారింది. నేడు స్వేరో నాయకులు టెండర్లు చేయడం వలన అందులో ఏమైనా లోటు పాట్లు నాణ్యమైన  కిరాణం సరుకులు, కూరగాయలు, పండ్లు, గ్రుడ్లు, చికెన్, మటన్, క్యాటరింగ్, స్వీపింగ్, శానిటేషన్ వంటివి అందించే క్రమలో నాణ్యంగా లేక పోవడంతో స్వేరో లకు గురుకులాల ప్రిన్సిపల్స్ గట్టిగా చెప్పి నాణ్యమైన సరుకులు, నాణ్యమైన సేవలు చేయించుకోలేకపోతున్నారని అనుమానాలు బలంగా వినపిస్తున్నాయి. పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్సే కాదు జిల్లా రిజినల్ అధికారులు కూడా స్వేరోస్ చేసి అవినీతి అక్రమాలను ఎదురించలేక పోతున్నారా.. ఎందకంటే స్వేరోస్ నెట్ వర్క్ వ్యవస్థాపక అద్యక్షులు తెలంగాణ గురుకులాల కార్యదర్శి గా పని చేస్తూ ఉన్నతాదికారిగా ఉండటం వలన స్వేరో లను మందలిస్తే వారి వారి ఉద్యోగాలకు ఎసరు అవుతుందనే భయంతో మందలించలేకపొతున్నారే వాదనలు వినిపిస్తున్నాయి.

చెప్పేది ఒకటి.. చేసిది ఒకటి:

ఆకాశమే హద్దుగా నవ సమాజ స్థాపన దిశగా విద్యే ఆయుధంగా దూసుకుపోయే సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ ఇతర విద్యార్థులను స్వేరో గా నామకరణం చేసి అంబేద్కర్, పూలే ఆశయ సాధనకు పాటుపడే ప్రతి వ్యక్తి మానసిక శారీరక సామాజిక అభివృద్ధి ఈ సృష్టి లో నిజమైన అభివృద్ధిగా భావిస్తూ భవిషత్తు తరాలకు ఆదర్శంగా స్వేరోలు అన్ని విషయాల్లో దృడ సంకల్పంతో మానసిక స్థైర్యాన్ని కలిగి సమాజానికి మార్గ దర్శకులుగా ఉండాలని ప్రతి స్వేరో మన పూర్వికులు మహాత్మా జ్యోతి రావు పూలే, సావిత్రి భాయి పూలే, అంబేద్కర్, కొమురం భీమ్, ఖాన్షి రావులు చేసిన గొప్ప త్యాగాలను గుర్తు తెచ్చుకొని వారి త్యాగాల పూనదుల పై కొత్త తరాన్ని నిర్మించాలని సంసిద్దులను కావాలని స్వేరోలు ఇందులో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత, శారీరక ద్రుడత్వం, ఆరోగ్యం, జ్ఞాన ఖడ్గం చేపట్టి ఈ జ్ఞాన సంకల్పంతో సుధీర్గ ప్రయాణం చేయడానికి స్వేరోలు సంసిద్ధం కావాలని చెబుతూ….వారు చేసేది మాత్రం స్వార్థంతో కూడుకున్న డబ్బు సంపాదనే లక్ష్యంగా గురుకులాలపై ఎగబడి దోచుకోవడం మొదలు పెట్టారు. నామ మాత్రానికి గ్రామా గ్రామాన కమిటీలు వేసి వాటి ద్వారా మందలు, డివిజన్ లు, జిల్లాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ముందు కొన్ని వాగ్ధానాలు అయిన కమిటీలలో ఉండే నాయకుల కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, గురుకులాల్లో టెండర్లు ఆశించకూడదని విలేఖర్ల సమావేశాల్లో చేబుతూనే కమిటీలు ఏర్పాటు అయ్యాక వారు చేసే పనులన్నీ ఇవే. ఊదాహరణకు ఇప్పుడు ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నిత్యావసర వస్తువులు టెండర్లు, స్వీపింగ్ అండ్ శానిటేషన్ టెండర్లలో జిల్లా, డివిజన్ మండల కమిటి నాయకులే ఉన్నారంటే ఇంతకంటే ఊదాహరణ ఏమి లేదు.

పథకం ప్రకారమే భీనామి పేర్లతో టెండర్లు పంచుకున్నారు:

2018-19 సంవత్సరానికి గాను గురుకులాల్లో క్యాటరింగ్, కిరాణం, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, గ్రుడ్లు, స్వీపింగ్, శానిటేషన్ వంటి టెండర్లను మండల, డివిజన్, జిల్లా కమిటీలల్లో ఉన్న నాయకులూ గుట్టు చప్పుడు కాకుండా వారి వారి అనుచరులైన వారి కుటుంబ సభ్యులు , మిత్రుల పేరుతో టెండర్ ఫారం కొనిపించి వాటిని అనుకూలమైన రేట్లకు టెండర్లు వేయించి గురుకులాల రిజినల్, జిల్లా అధికారులతో ముందే ఒప్పందాలు కుదుర్చుకొని పథకం ప్రకారం అవతలి వ్యక్తులు తక్కువ రేటుకు కోట్ చేసిన వారిని పక్కన పెడుతూ తాము స్వేరోలము అదే రేటుకు మేము చేస్తామంటూ తక్కువ రేట్లకు టెండర్లను దక్కించుకొని రెండు మూడు నెలల తరువాత గిట్టుబాటు అవడం లేదంటూ గురుకులాల కార్యదర్శి తో రెట్లు పెంచుకోవచ్చనే అనే దృడనమ్మకం తో వారి వారి అనుచరుల పేర్లతో జిల్లాలో ఒక్కో నాయకులు పది నుండి 15 టెండర్లు దక్కించుకున్నారు. పథకం ప్రకారమే ముందే సంబధిత అధికారులను అనుసంధాల్లో ఉంచుకొని ఏ యే పాఠశాల/కళాశాలల్లో ఏ ఏ నాయకునికి కావాలో ముందే నిర్ణయం చేసుకొని ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా స్వేరో నాయకులు భినామి పేర్లతో టెండర్లను వశపర్చుకున్నారు. అవతలి వ్యక్తులు టెండర్ ఫారాలకు వేలాది రూపాయల వ్యయం వెచ్చించి నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఎదురైంది అంటే స్వేరోల ఆగడాలు ఎలా ఉన్నాయో తెలుసు కోవచ్చు.

దొరికిన కాడికి దోచుడే

ఒక్క సాంఘీక సంక్షేమ గురుకుల/కళాశాలలో కాకుండా మహాత్మా రావు పూలే , ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ వసతి గృహాల్లోని టెండర్లలో కూడా స్వేరోలు గురుకులాల సెక్రటరి పేరును వాడుకొని ఆయా సంస్థల ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని మా సారూ చెప్పారంటూ వారితో నమ్మబలికి అందులో కూడా వారి వారి అనుచరులతో టెండర్ ఫాంలు వేయించి టెండర్లు దక్కించుకున్నారు. దీనిని బట్టి చూస్తే స్వేరోలు సమాజ సేవకులా జేబులు నింపుకునే వ్యాపారంగా తయారయ్యారా  అనే విధంగా అర్ధం చేసుకోవచ్చు.

(మనం సోజన్యం తో)