Home News ఉగ్రవాద దేశం పాకిస్థాన్ : టెక్సాస్ సీనాగోగ్ సంఘటన లోని తీవ్రవాది మాలిక్ ఫైసల్ అక్రమ్...

ఉగ్రవాద దేశం పాకిస్థాన్ : టెక్సాస్ సీనాగోగ్ సంఘటన లోని తీవ్రవాది మాలిక్ ఫైసల్ అక్రమ్ తబలిగి జమాత్ సభ్యుడు

0
SHARE

శనివారం టెక్సాస్ లోని యుధుల సమాజమందిరంలో బందీగా తీసుకున్న మాలిక్ ఫైసల్ అక్రమ్ పాకిస్తాన్ లోని పంజాబ్ లోని జీలం జిల్లాకు చెందినవాడు. అతని కుటుంబం దాదాపు 50 సంవత్సరాల క్రితం యుకెకు వలస వచ్చింది. ఈ ఉగ్రవాది తబలిగి జమాత్ సభ్యుడు అని తేలింది .

అక్రమ్ టెక్సాస్ యూధుల సమాజమందిరంలో నలుగురిని బందీలుగా తీసుకున్నాడు, దీనిని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ “ఉగ్రవాద చర్య”గా పేర్కొన్నారు. బద్రతాదళాల చేతిలో అక్రమ్ ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటన నేపథ్యంలో, అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇనిస్టిట్యూట్ విశ్లేషణ ప్రకారం, ఈ ఉగ్రవాద సంఘటన తో మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాద-ప్రాయోజిత దేశంగా నిరూపణ అయింది.

ది హిందుస్థాన్ టైమ్స్ లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, అక్రమ్ పాన్-ఇస్లామిక్ తబ్లిఘి జమాత్ లో సభ్యుడు, సంస్థకు సంబంధించిన పనుల కోసం విదేశాలకు వెళ్లాడు. అతను గుజరాతీ ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు ఐదుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. అతని వైవాహిక జీవితం అంత సవ్యంగా లేదు.అతని తండ్రితో , ఇతర కుటుంబ సభ్యులతో కూడా పేలవమైన సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం. అక్రమ్ తండ్రి లండన్ లోని ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రసిద్ధ సభ్యుడు అని సమాచారం. లేబర్ పార్టీతో సంబంధం ఉన్న కౌన్సిలర్ మాలిక్ ఇర్ఫాన్ ద్వారా అతని కుటుంబానికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి.

నివేదికల ప్రకారం, అక్రమ్ గతంలో లండన్ లోని రోండెల్ వీధి ఇస్లామిక్ సెంటర్ కు అధిపతిగా పనిచేశాడు, దీనిని రెజా మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మస్జిద్ ప్రధానంగా పాకిస్తాన్ సంతతికి చెందిన ముస్లింలు వచ్చే స్థలం. ఎక్కువగా గుజరాతీ ముస్లింలు ప్రార్థన చేసిన ఎల్డోరాడో మసీదులో కూడా ఇతను వెళ్ళేవాడు . పాలస్తీనా అనుకూల ఎజెండా మరియు గ్వాంటానామో బే ఖైదీల ర్యాలీలకు మద్దతు ఇచ్చే ప్రదర్శనలలో కూడా పాల్గొన్నాడు.

అమెరికాలో 80 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ న్యూరోసైంటిస్ట్ ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని అక్రమ్ కోరాడు, అతను ‘లేడీ అల్ ఖైదా’ అని కూడా పిలువబడుతుంది.

2010 లో సిద్ధిఖీకి అమెరికా లోని కోర్టు శిక్ష విధించడం పాకిస్తాన్ లో ఆగ్రహం రేకెత్తించింది. ఉగ్రవాద వర్గాల ఎన్నో ఒత్తిళ్ళ తరువాత , 2018 లో పాకిస్తాన్ సెనేట్ లో ఆమెను “డాటర్ ఆఫ్ ది నేషన్” అనీ , ఆమెను స్వదేశానికి తిరిగి తీసుకు రావడానికి అన్నీ చర్యలు తీసుకోవాలనీ ప్రభుత్వాన్ని కోరింది.

సిద్ధిఖీ అరెస్టు వార్త అమెరికాలో పెద్దగా ప్రాచుర్యం కాకపోయినా , ఆమె నేరారోపణ పాకిస్తాన్ లో విస్తృత ప్రదర్శనలకు దారితీసింది. పైగా ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధ ప్రయత్నాలకోసం అమెరికా ప్రభుత్వానికి పాకిస్థాన్ ప్రభుత్వం సహాయం చేయడం ఆపాలి అని ఆ ప్రదర్శనకారుల డిమాండ్

కొసమెరుపు ; “సిద్ధిఖీ అమెరికాలో బాగా తెలియదు, కానీ పాకిస్తాన్ లో, ఆమె కు చాలా పేరు – చాలా మంది ఆమెను అమాయక బాధితురాలిగా చూస్తారు. మత ఉన్మాద సంస్థ ఐసిస్ , కూడా ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేసింది’ అని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్ లో ఆసియా ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మన్ ట్విట్టర్ లో రాశారు. (హెచ్ టి మరియు ఎఎన్ఐ నుంచి ఇన్ పుట్ లతో)

అనువాదం: చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

Source : ORGANISER