Home News నారదుడి లక్షం లోక కళ్యాణమే – శ్రీ వేదుల నరసింహం

నారదుడి లక్షం లోక కళ్యాణమే – శ్రీ వేదుల నరసింహం

0
SHARE

శ్రీ నారద ముని ప్రపంచంలోనే మొట్ట మొదటి పాత్రికేయుడని, వారిని కొందరు కలహాల మాంత్రికుడిగా చేశారని, కానీ నిజానికి వారు సమాజ హితం, ధర్మ రక్షణ, సమస్యల పరిష్కారం కోసమే అందరి మధ్య వారధిలా పని చేసారని, సమాచార భారతి సబ్యులు శ్రీ వేదుల నరసింహం గారు తెలిపారు.

నరసింహం గారు విశ్వ సంవాద్ కేంద్ర, సమాచార భారతి అద్వర్యంలో సంగారెడ్డి నగరంలోని బికెఎస్  భవన్ లో నిర్వహించిన నారద జయంతి, ప్రపంచ పాత్రికేయు దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నారదడు లోకకళ్యాణం గురుంచి ఏ విధంగా తాపత్రయ పడేవారో వివరిస్తూ, నేటి సమాజంలో అలాంటి భాద్యతలోనే ఉన్న పాత్రికేయులు ఆయనను స్పూర్తిగా తీసుకొని పని చేయాలని కోరారు.

శ్రీ వేదుల నరసింహం

స్వాతంత్ర్య సమరంలోనూ లాలా లజపతి రాయ్, వీర సావర్కర్, అరవింద ఘోష్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి తదితర మహానుభావులెందరో పత్రికలను నడిపారని గుర్తు చేసారు. అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా పాత్రికేయ రంగం నుంచే వచ్చారన్నారు. జర్నలిజం విలువలు పడిపోవడం లేదని, పెడ ధోరణిలో పడకుండా  వాటిని కాపాడుకోవాల్సిన భాద్యత అందరి పై ఉన్నదన్నారు.

సీనియర్ పాత్రికేయుడు టి యు డబ్ల్యు జే జిల్లా అద్యక్షుడు శ్రీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని వాస్తవాలను వేలికితీయల్సిన అవసరం ఉన్నదన్నారు. జాతీయత, దేశ భక్తిని పెంపొందించేదందుకు ప్రసార మాధ్యమాల కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. గుడ్డిగా జాతీయతను ప్రశ్నించే స్థాయి పెరిగితే ప్రమాద పరిస్థితులు  ఎదురయ్యే అవకాశం ఉన్నదన్నారు. సుస్థిర సమాజ ఏర్పాటులో మీడియా పాత్ర కీలకమన్నారు, ఇటీవల వికిలీక్స్ అనేక రహస్యాలను బహిర్గతం చేసినదిని, ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు.

కార్యక్రమంలో పాత్రికేయలను మేమెంటోలతో సన్మానించారు. సీనియర్ పాత్రికేయులు అవధాని, బాల కృష్ణ, వెంకటేశం, దయనందం, రాజు గౌడ్, శివ తో పాటు స్థానిక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు, ఆర్ ఎస్ ఎస్ జిల్లా సంఘ్ చాలక్ శ్రీ ఎన్ సి రామకృష్ణఆర్ ఎస్ ఎస్ జిల్లా కార్యవాహ శ్రీ బొల్లి నర్సింలు, సమాచార భారతి సభ్యులు శ్రీ మద్దూరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.