Home News అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంతిత్ర‌శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో...

అక్ర‌మ‌ మ‌త‌మార్పిళ్ల కేసుకు సంబంధించి శిశు సంక్షేమ మంతిత్ర‌శాఖ‌లో ప‌ని చేసిన‌ సంకేత భాషా నిపుణుడితో స‌హా మ‌రో ఇద్ద‌రి అరెస్టు

0
SHARE

సామూహిక మార్పిడి రాకెట్టును నడుపుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన వారం తర్వాత అదే కేసుకు సంబంధించి కేంద్ర మ‌హిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సంకేత భాషా (sign language) నిపుణుడితో సహా ఇద్ద‌రిని యుపీ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) సోమవారం ల‌క్నోలో అరెస్టు చేసింది.

ఈ సంద‌ర్భంగా ఎటిఎస్ చీఫ్ జికె గోస్వామి మాట్లాడుతూ “ మ‌హిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌లో సంకేత భాషా (sign language) వాఖ్య‌త‌గా  ప‌ని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇర్ఫాన్ ఖవాజా ఖాన్ అనే వ్య‌క్తిని సామూహిక మ‌త మార్పిళ్ల కేసులో అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. ఇయ‌న‌తో పాటు న్యూ ఢిల్లీకి చెందిన రాహుల్ భోలా, గుర్గావ్‌కు చెందిన మన్నూ యాదవ్ అలియాస్ మన్నన్ ను కూడా అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. వీరిద్ద‌రికి వినికిడి లోపంతో, మాట్లాడ‌టంలో లోపం ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ అవ‌కాశంతో  వినికిడి లోపం ఉన్న పిల్ల‌ల‌ను, మూగ పిల్ల‌ల‌ను సంప్ర‌దించి వారిని ఇస్లాం మతంలోకి మారడానికి ఆకర్షించేవార‌ని ఆయ‌న తెలిపారు.

వినికిడి లోపం ఉన్న వారితో ఇర్ఫాన్‌కు మంచి సంబంధాలున్నాయ‌ని, సంకేత భాషలో తన నైపుణ్యంతో ఇస్లాం పట్ల వారిని ఆకర్షించేలా చేస్తూ, ఇతర మతాల ప‌ట్ల ద్వేషం పెంచుతూ వారి మనస్సులను విషపూరితం చేసే కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాడ‌ని, ఇందుకు భోలా, మన్నూ యాదవ్ లు ఇర్ఫాన్‌కు స‌హ‌క‌రించేవార‌ని పోలీసులు తెలిపారు. భోలా, మన్నూ యాదవ్ వీరిద్ద‌రూ వినికిడి, మాట్లాడ‌టం లోపం ఉన్న పిల్లలను సంప్రదించి మ‌త మార్పిడి కోసం వారిని ఆకర్షించేవార‌ని తెలిపారు. పిల్లల మార్పిడికి మన్న యాదవ్ ప్రమేయం ఉందని నిర్ధారించడానికి త‌మ వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని అని అధికారులు స్ప‌ష్టం చేశారు.

“ఇర్ఫాన్ ఖావాజా ఖాన్ ఉన్న‌త చ‌దువులు చ‌దివి ప్ర‌భుత్వ శాఖ‌లో ప‌ని చేస్తూ ఉన్న‌తాధికారులు, రాజ‌కీయ నాయ‌కుల నుంచి ప్ర‌శంస‌లు కూడా పొందాడు. అలాంటి వ్య‌క్తి కూడా చివ‌రికి అక్ర‌మ మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. ”

యూపీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో  వివిధ మతాలకు చెందిన వారిని ఇస్లాం మతంలోకి పెద్ద ఎత్తున అక్రమ మతమార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన ఉమర్ గౌతమ్, జహంగీర్ ఆలం ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్న స‌మ‌యంలో ఈ మార్పిడి మూఠా వెలుగులోకి వచ్చింది.

జహంగీర్ ఆలం ఒక ఇస్లామిక్ బోధకుడు. ఇత‌ను ఢిల్లీలోని జామియా నగర్ లో ఇస్లామిక్ కేంద్రం(ఐడిసి) తో సంబంధం కలిగి ఉన్నాడ‌ని, ఈ కేంద్రాన్ని సామూహిక మార్పిడులకు ఉపయోగించారని ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఉమర్ గౌతమ్ అనే మ‌రో వ్య‌క్తి కొన్నేళ్ల క్రిత‌మే ఇస్లాం మ‌తం స్వీకరించాడ‌ని, ఆ త‌ర్వాత మ‌త‌మార్పిడి చేయ‌డానికి స‌రైన వ్య‌క్తుల‌ను గుర్తించే కార్య‌క‌లాపాలు కొన‌సాగించార‌ని పోలీసులు తెలిపారు.

గత 18 నెలల్లో ఈ ముఠా 1,000 మందికి పైగా మతమార్పిడి చేసిన‌ట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు.  ఈ మేర‌కు వీరిద్దరితో పాటు మ‌రికొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల‌పై, ఐడిసి ఛైర్మన్‌పై ఐపిసి సెక్షన్లు 420, 120 బి, 153 ఎ (మతం ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), జాతీయ సమైక్యతకు పక్షపాతపూర్వక వాదనలు), 295 (ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం), 511 (నేరాలకు పాల్పడే ప్రయత్నం) తో పాటు యుపి నిషేధిత మత మార్పిడి చట్టంలోని సంబంధిత చ‌ట్టాల కింద లక్నోలోని ఎటిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.