బంగ్లాదేశ్, మయన్మార్ లకు చెందిన రోహింగ్యాలు అక్రమంగా భారత్‌కు తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాలను భారత్‌కు తీసుకువచ్చి చట్టవిరుద్ధంగా దేశంలో స్థిరపడటానికి నిధులు పొందుతున్నట్టు తేలింది.
నివేదికల ప్రకారం… నూర్ ముహమ్మద్, రెహ్మత్ ఉల్లా, షబీల్లా అనే ముగ్గురు సభ్యుల ముఠా బంగ్లాదేశ్, మయన్మార్ లకు చెందిన మహిళలను, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిని ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ వంటి నగరాల్లో స్థిరపరచడానికి అక్రమ మానవ రవాణా కార్యకలాపాలు పాల్పడుతున్నారు.
బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులను చట్టవిరుద్ధంగా వసతులు ఏర్పాటు చేయడానికి ఒక అంతర్జాతీయ ముఠా కుట్రలు చేస్తోందని యుపి ఎటిఎస్ కొంతకాలంగా సమాచారం పొందుతోందని పోలీసు శాఖ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా యూపీ డీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ “ఎటిఎస్ చేపట్టిన తనిఖిలో భాగంగా ముఠా నాయకుడు నూర్ ముహమ్మద్ అలియాస్ నూర్ ఇస్లాం బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్ ద్వారా కొంతమంది రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ఎటిఎస్ బృందం ఘజియాబాద్ స్టేషన్ వద్ద ఐదుగురిని పట్టుకుని విచారణ చేపట్టగా వివాహం, ఉద్యోగం అనే నెపంతో వారిని అక్రమ వలసదారులుగా ఢిల్లీకి తీసుకువస్తున్నట్టు తేలిందని, దీనికి వారికి పెద్ద మొత్తంలో నిధులు కూడా అందినట్టు తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వసలదారులను కలవడానికి ఢిల్లీ స్టేషన్ వద్ద మమ్మద్ అనుచరుడు ఒకడు వేచి ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని అధికారి తెలిపారు. 16, 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను కూడా రక్షించామని, ఇద్దరూ మయన్మార్‌కు చెందినవారు అని పోలీసు అధికారి తెలిపారు.
అక్రమ రవాణాకు గురైన మరో వ్యక్తిని పోలీసులు రక్షించారు. ముగ్గురు నిందితులు అక్రమ వలసదారులు. నూర్ ఇస్లాం బంగ్లాదేశ్ కు చెందినవాడు. ప్రస్తుతం త్రిపురలో నివసిస్తున్నాడు. రెహమత్ ఉల్లా మయన్మార్ నుండి వచ్చినవాడు, అతను రోహింగ్యాల కోసం జమ్మూ కాశ్మీర్ శరణార్థి శిబిరంలో ఉంటున్నాడు. మూడవ నిందితుడు- షబీల్లా కూడా మయన్మార్‌కు చెందినవాడు. ఈ ముగ్గురిపై ఐపిసి సెక్షన్లు 420, 467, 468, 471, 370, 120 బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Source : OP INDIA