Home News వక్రీకరించబడిన చరిత్రను గుర్తించి వాస్తవాలను విద్యార్థులకు తెలియచేయాలి – శ్రీ యం.వి.ఆర్.శాస్త్రి

వక్రీకరించబడిన చరిత్రను గుర్తించి వాస్తవాలను విద్యార్థులకు తెలియచేయాలి – శ్రీ యం.వి.ఆర్.శాస్త్రి

0
SHARE

శ్రీ సరస్వతీ విద్యాపీఠం, విద్వత్ పరిషత్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో  6 జనవరి 2019వ తేదీ ఆదివారం మెదక్ జీ.కే.ఆర్ గార్డెన్లో ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ రచయిత, పాత్రికేయులు శ్రీ యం.వీ.ఆర్ శాస్త్రి మాట్లాడుతూ సనాతన ధర్మమే భారతదేశానికి గుండేకాయ వంటిదని, హిందుత్వము మన జీవనవిధానమన్నారు. ఇస్లాం,క్రైస్తవ మతాల ప్రజలు మెజారిటీగా ఉన్న దేశాల్లో వారి మత ఆచారాలను పాటించినపుడు, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ఎందుకు హిందుధర్మాన్ని అనుసరించడం లేదో మనం ఆలోచించాలన్నారు. మన దేశంలో రాజకీయ స్వార్థాల కోసం మైనారటీలను ప్రభుత్వాలు పైకెత్తుకుంటున్నాయి అన్నారు. అనాదిగా ఎందుకు ఇటువంటి పరిస్థితి తయారయ్యిందో మననం చేసుకోవాలన్నారు. వాటికన్ సిటీలో శివలింగం బయటపడింది, దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు హిందుత్వము, హిందూ దేవాలయాలు విశ్వవ్యాప్తంగా ఉండేవని.. కాని నేడు ఎందుకు ఇవన్ని కనిపించడం లేదంటే అనేక దేవాలయాలు ఇస్లాం, క్రైస్తవ రాజుల పరిపాలనలో ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పటికైన హిందూ సమాజం జాగృతం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మన దేశంపై మొఘలాయిలు,ఘోరీ, బాబర్, ఆంగ్లేయులు, పఠాన్లు వంటి దురాక్రమణదారులు దాడులు చేశారు. కాని సనాతన హిందూ ధర్మము, భారతదేశము ఏ దేశంపై దాడి చేయలేదు. మన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని హిందుత్వంపై దాడులు చేశారన్నారు. అందుకే ఉపాధ్యాయలు వక్రీకరించబడిన చరిత్రను గుర్తించి వాస్తవ చరిత్రను విద్యార్థులకు తెలియచేయాలన్నారు.

విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సహకార్యదర్శి అయాచితుల లక్ష్మణ్ రావ్ జీ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు వస్తున్నాయి కాని గుణములు రావడం లేదన్నారు. విద్యార్థికి శారీరక, మానసిక, బౌద్దిక, ఆధ్యాత్మిక, గుణవికాసం జరిగినపుడే సర్వాంగీణ వికాసం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పలు అంశాలపై డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు, ఉపాధ్యాయులు భానుప్రకాశ్, అంజాగౌడ్ లు పత్రసమర్పణ చేశారు. డాక్టర్ సురెందర్ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ సమ్మేళనంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ వామనమూర్తి వ్యాఖ్యానం చేశారు. విద్వత్ పరిషత్ జిల్లా కన్వీనర్ అశోక్ వేదిక పరిచయం చేశారు. ఉపాధ్యాయలు ప్రవీణ్ కుమార్ సూక్తిపఠనం చేయగా, మంగ నర్సింలు, విభాగ్ సహకార్యవాహ బోల నాగభూషణం వయక్తిక్ గీత్ ఆలపించారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి తీర్మాణం చేయడం జరిగింది. అధ్యాపకులు రామారావ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో విద్వత్ పరిషత్ మెక్ జిల్లా, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత, జిల్లా, ప్రబందకారణీ, సమితి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వివిధ క్షేత్రాల బాధ్యులు పాల్గొన్నారు.